Thursday, November 21, 2024

Letter: మేడమ్​ ప్రెసిడెంట్​, అయామ్​ వేరీ సారీ!.. క్షమాపణ కోరుతూ లేఖ రాసిన కాంగ్రెస్​ లీడర్​

రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు కాంగ్రెస్​ లీడర్​ అధిర్​ రంజన్​ చౌదరి ఇవ్వాల (శుక్రవారం) క్షమాపణ కోరుతూ లేఖ రాశారు. తను ఈ మధ్య రాష్ట్రపతిని ‘రాష్ట్రపత్ని’గా వ్యాఖ్యానించడంతో దేశవ్యాప్తంగా పెద్ద దుమారమే చెలరేగింది. దీనిపై బీజేపీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. కాంగ్రెస్​ పార్టీ అధిష్టానం కూడా ఈ వ్యాఖ్యలను సీరియస్​గా తీసుకుంది.

దీనిపై తొలుత క్షమాపణ చెప్పేది లేదు, తాను తప్పుగా వ్యాఖ్యానించలేదన్న అధిర్​ రంజన్​ చౌదరి ఆ తర్వాత కాంగ్రెస్​ పార్టీ పెద్దల జోక్యంతో దిగివచ్చారు. ఇక.. ‘‘మీరు కలిగి ఉన్న పదవిని వివరించడానికి పొరపాటున తప్పు పదాన్ని ఉపయోగించినందుకు చింతిస్తున్నట్లు నేను రాస్తున్నాను. ఇది నాలుక జారడం అని నేను మీకు హామీ ఇస్తున్నాను. నేను క్షమాపణలు కోరుతున్నాను. దానిని అంగీకరించవలసిందిగా కోరుతున్నాను” అని కాంగ్రెస్ లీడర్​ అధిర్​ తన లేఖలో పేర్కొన్నారు.

కాగా, చౌదరి అంతకుముందు ఒక వీడియో క్లిప్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని ‘రాష్ట్రపత్ని’ అని ప్రస్తావించడం, దీని తర్వాత పార్లమెంటులో పెద్ద దుమారం చెలరేగింది. ఆయన వ్యాఖ్యలపై పార్లమెంటులో నిరసన తెలిపిన బీజేపీ ఎంపీలు విమర్శలు గుప్పించారు. చౌదరి వ్యాఖ్యలపై కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసిన బీజేపీ నేతల్లో కేంద్రమంత్రులు స్మృతి ఇరానీ, నిర్మలా సీతారామన్ కూడా ఉన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement