Monday, September 16, 2024

12న థియేటర్లలోకి రానున్న మాచర్ల నియోజకవర్గం.. కార్తికేయ2తో కాంపిటేషన్​

టాలివుడ్ యువ నటుడు నితిన్ ప్రధాన పాత్రలో తెర‌కెక్కిన మూవీ “మాచర్ల నియోజకవర్గం”. ఈ సినిమాలో నితిన్ తొలిసారి ఐపీఎస్ ఆఫీసర్ పాత్రలో క‌నిపించనున్నాడు. అలాగే ఈ సినిమాలో ఉప్పెన ఫేమ్ కృతి శెట్టి కథానాయికగా నటిస్తోంది. అందమైన దివా అంజలి ఓ స్పెష‌ల్ సాంగ్ లో క‌నిపించ‌నుంది. కొద్ది రోజుల క్రితం, మేకర్స్ ఈ సాంగ్ “రారా రెడ్డి” ప్రోమోను విడుదల చేసారు. ఈ పాట‌కు అద్భుతమైన స్పందనను వ‌చ్చింది. దీంతో సినిమా సినీ ప్రేమికుల మధ్య మంచి హైప్ క్రియేట్ అయింది.

కాగా, ఈ సినిమా ఆగస్ట్ 12న రిలీజ్ కానుంది. ఇక దాని మ‌రుస‌టి రోజు ఆగస్ట్ 13న థియేటర్లలోకి రాబోతున్న నిఖిల్ సిద్ధార్థ నటించిన కార్తికేయ 2తో పోరుబాట పట్టనుంది. మోత్తానికి మాచర్ల నియోజకవర్గం, కార్తికేయ 2 రెండు సినిమాలు గ్రాండ్‌గా విడుదలకు సిద్ధమయ్యాయి.

తాజా రిపోర్ట్ ప్రకారం ఈ రెండు సినిమాల టిక్కెట్ ధరలు ఈ విధంగా ఉండ‌నున్నాయి.

సింగిల్ స్క్రీన్‌లు: Rs 147(AP), Rs 150 (TS)

మల్టీప్లెక్స్: Rs 177 (AP), Rs 200 (TS)

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement