హైదరాబాద్ – డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను ప్రముఖ సినీ నటుడు, మా అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు కలిశారు. ఆదివారం హైదరాబాద్లోని భట్టి నివాసంలో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఆయనతో పాటు మా కార్యవర్గ సభ్యులు శివబాలాజీ, రఘబాబు కూడా ఉన్నారు.
ఈ సందర్భంగా తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన పలు సమస్యలపై వారు చర్చించారు. అనంతరం డిప్యూటీ సీఎం భట్టిని సన్మానించారు. తెలుగు చిత్ర పరిశ్రమకు కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి సంపూర్ణ సహకారం ఉంటుందని భట్టి హామీ ఇచ్చారు.