Saturday, November 23, 2024

పోలీస్‌ యాప్‌తో ఎం పాస్‌పోర్టు

పాస్‌పోర్టు కోసం దరఖాస్తు చేసుకున్న వారు స్లాట్స్‌ కోసం చాలా సమయం వేచి చూడాల్సి వస్తోంది. పాస్‌పోర్టులకు డిమాండ్‌ భారీగా పెరడంతో పాస్‌పోర్టుల జారీలో జాప్యం జరుగుతున్నది. దీన్ని నివారించేందుకు కేంద్ర ప్రభుత్వం ఎం పాస్‌పోర్టు పోలీస్‌ యాప్‌ తీసుకువచ్చింది. దీని వల్ల ఈ ప్రక్రియ వేగవంతం కానుంది. పాస్‌పోర్టు జారీ చేసేందుకు పోలీస్‌ వెరిఫికేషన్‌ చేస్తారు.దీనికి ఒక్కోసారి సమయం ఎక్కువ తీసుకుంటున్నది.

పోలీస్‌లు ఇంటికి వచ్చి సేకరించిన వివరాలను ఎంపాస్‌పోర్టు పోలీస్‌ యాప్‌ నుంచి నేరుగా సబ్మిట్‌ చేస్తారు. దీంతో ఈ ప్రక్రియ వేగంగా పూర్తవుతుంది. పోలీస్‌ వెరిఫికేషన్‌కు 15 రోజుల వ్యవధి 5 రోజులకు తగ్గుతుందని విదేశాంగ శాఖ తెలిపింది. మొత్తంగా పాస్‌పోర్టు జారీ సమయం 10 రోజులకు తగ్గుతుందని తెలిపింది. దేశవ్యాప్తంగా 555 పాస్‌పోర్టు కేంద్రాలు ఉన్నాయి. వీటిలో 36 పాస్‌పోర్టు ఆఫీస్‌లు, 93 పాస్‌పోర్టు సేవా కేంద్రాలు, 426 పోస్టాఫీస్‌ పాస్‌పోర్టు సేవా కేంద్రాలు ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement