Saturday, November 23, 2024

లగ్జరీ కార్లపై ఫిదా, భారత్‌లో పెరుగుతున్న సేల్స్‌.. బెంజ్‌, ఆడీ, బీఎండబ్ల్యూ టాప్‌

భారత్‌లో రోజురోజుకూ లగ్జరీ కార్లపై ప్రేమ పెరుగుతున్నది. దీంతో విలాసవంతమైన కార్లు తయారు చేసే సంస్థలు.. మెర్సిడేజ్‌ బెంజ్‌, ఆడీ, బీఎండబ్ల్యూ కొనుగోలుదారులకు అభిరుచికి అనుగుణంగా ముందుకు వెళ్తున్నాయి. తమ వ్యాపారాన్ని మరింత విస్తరించుకుంటున్నాయి. సరికొత్త మోడల్స్‌తో వాహన రంగంలో రాణిస్తున్నాయి. విలాసవంతమైన కార్లకు డిమాండ్‌ ఎక్కువగా ఉండటంతో.. డెలివరీకి కూడా ఎక్కువ సమయం తీసుకుంటున్నాయి. గతేడాది నుంచి కొన్ని నెలల వ్యవధిలోనే సీ అండ్‌ డీ సెగ్మెంట్‌లో రూ.70-75 లక్షలకు పైగా ఉన్న కార్లకు భారీ డిమాండ్‌ పెరిగింది. ఆ విభాగంలో వాల్యూమ్‌-సెగ్మెంట్‌ కార్ల విభాగంలో వృద్ధి సాధించింది. వ్యాపారవేత్తలు, స్పోర్ట్‌ ్స పర్సన్‌లు, సినీ రంగ ప్రముఖులు ఈ సెగ్మెంట్‌లోని కార్లను కొనుగోలు చేస్తున్నారు. దీంతో రోజురోజకూ వీటికి డిమాండ్‌ పెరుగుతున్నది. కోటి రూపాయలకు పైగా ఉన్న కార్లు.. భారత్‌లోకి రాకముందే అమ్ముడు పోతున్న పరిస్థితి నెలకొంది. మెర్సిడేస్‌ బెంజ్‌లో జీఎల్‌ఎస్‌, జీఎల్‌ఈ (ఎస్‌యూవీ) మోడల్స్‌ను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీని కోసం నెలల పాటు వేచి చూస్తున్నారు.

2022 తొలి త్రైమాసికంలో 4,000 యూనిట్లకు పైగా ఆర్డర్‌లు పొందినట్టు మెర్సిడీస్‌ బెంజ్‌ తెలిపింది. గతేడాది రూ.కోటికి పైగా విలువ చేసే 2వేల టాప్‌ ఎండ్‌ కార్లను విక్రయించింది. మరో లగ్జరీ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఈ కంపెనీ కార్లకు కూడా డిమాండ్‌ పెరిగింది. ఎస్‌ఏవీ (స్పోర్ట్‌ యాక్టివిటీ వెహికిల్స్‌), ఎక్స్‌3, ఎక్స్‌4, ఎక్స్‌7 మోడళ్లు బాగా అమ్ముడుపోతున్నాయి. 80 శాతం వృద్ధి నమోదైంది. బీఎండబ్ల్యూ ఇండియా ఎస్‌ఏవీ సెగ్మెంట్‌లో 40 శాతం వృద్ధితో రూ.61లక్షల కుపైగా ధరలతో.. మొదటి త్రైమాసికంలో 1,345 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. 3 నెలల వెయిటింగ్‌ పీరియడ్‌ ఉంది. కాంపాక్‌ ్ట లగ్జరీ కారు మినీతో పాటు మొత్తం 2,500 కార్లను బుకింగ్‌ చేసుకున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement