Wednesday, December 4, 2024

AP | ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం : మంత్రి లోకేష్

రాష్ట్రంలోని ప్రభుత్వ డ్రాపౌట్స్‌ ఎక్కువగా ఉన్నారని… మంత్రి నారా లోకేష్ అన్నారు. ఈ మేర‌కు కళాశాలల్లో హాజరుశాతం, విద్యాప్రమాణాల మెరుగుదల కోసం మంత్రి నారా లోకేష్‌ విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నారు. ఇంటర్మీడియట్‌ విద్యార్థులకు కూడా మధ్యాహ్న భోజనం అందించాలని నిర్ణయించారు.

ఉండవల్లి నివాసంలో పాఠశాల విద్య, ఇంటర్మీడియట్‌ విద్య శాఖ ఉన్నతాధికారులతో విద్య శాఖ మంత్రి నారా లోకేష్‌ సమీక్ష నిర్వహించారు. సమావేశంలో మంత్రి లోకేష్‌ మాట్లాడుతూ… ప్రభుత్వ ఇంటర్మీడియట్‌ కళాశాలల్లో మధ్యాహ్న భోజనం కల్పించడం ద్వారా డ్రాపౌట్స్‌ను కొంతమేర తగ్గించే అవకాశం ఉందని చెప్పారు. ఇంటర్మీడియట్‌ లో వెనుకబడిన విద్యార్థులకు క్వచ్చన్‌ బ్యాంక్‌ అందించాలని సూచించారు.

డిసెంబర్ 7న‌ మెగా పేరెంట్-టీచర్ మీటింగ్

రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో డిసెంబర్‌ 7వ తేదీన నిర్వహించే మెగా పేరెంట్‌-టీచర్‌ సమావేశాలను పండుగ వాతావరణంలో జరపాలని మంత్రి లోకేష్‌ సూచించారు. మంత్రులు, శాసనసభ్యులు వారు ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గాల్లోనే మెగా పేరెంట్‌-టీచర్ సమావేశాలకు హాజరు కావాలని అన్నారు.

ఎటువంటి పార్టీ జెండాలు, హంగు, ఆర్బాటాలకు తావీయవద్దని స్పష్టంచేశారు. బాపట్ల ప్రభుత్వ హైస్కూలులో నిర్వహించే మెగా పిటిఎం నిర్వహణకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తోపాటు తాను కూడా హాజరుకానున్ననట్లు మంత్రి చెప్పారు.

- Advertisement -

మెరుగైన ప్రమాణాలకు స్టార్ రేటింగ్

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాప్రమాణాల మెరుగుదల, మౌలిక సదుపాయాల కల్పన ప్రధాన లక్ష్యంగా స్టార్‌ రేటింగ్‌ ఇవ్వాలని సమావేశంలో నిర్వహించారు. ముఖ్యంగా విద్యార్థుల్లో నైతిక విలువలను పెంపొందించే పాఠ్యాంశాల కోసం రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు చాగంటి కోటేశ్వరరావు సలహాలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.

స్కూలు మైదానాలను జాబ్‌ మేళాలకు మినహా ఎటువంటి కార్యకలాపాల నిర్వహణకు అనుమతి ఇవ్వరాదని మంత్రి స్పష్టంచేశారు. ఈ సమావేశంలో పాఠశాల విద్య కార్యదర్శి కోన శశిధర్‌, డైరెక్టర్‌ విజయరామరాజు, ఇంటర్మీడియట్‌ విద్య కార్యదర్శి కృతికా శుక్లా పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement