Saturday, November 23, 2024

29న చంద్రగ్రహణం .. 8 గంటలపాటు శ్రీవారి ఆలయం మూసివేత‌

తిరుమల, ప్రభ న్యూస్‌ : ఈనెల 29వ తేదీన తెల్లవారుజామున పాక్షిక చంద్రగ్రహణం కారణంగా తిరుమల శ్రీవారి ఆలయం అక్టోబర్‌ 28 రాత్రి మూసివేస్తారు 29 న తిరిగి తెరవబడుతుంది. 29 న తెల్లవారుజామున 1.05 నుంచి తెల్లవారుజామున 2.22 గంటల మధ్య పాక్షిక చంద్రగ్రహణం పూర్తవుతుంది. కాబట్టి ఈనెల 28 న రాత్రి 7.05 గంటలకు ఆలయం తలుపులు మూసివేయనున్నారు.

గ్రహణం సమయానికి 6 గంటల ముందుగా ఆలయం తలుపులు మూసివేయడం ఆనవాయితీ. అక్టోబర్‌ 29 వ తేది తెల్లవారుజామున 3.15 గంటలకు ఏకాంతంలో శుద్ధి, సుప్రభాత సేవ నిర్వహించి ఆలయం తలుపులు తెరుస్తారు. చంద్రగ్రహణం కారణంగా 8 గంటల పాటు ఆలయం తలుపులు మూసి ఉంటారు.

ఈ కారణంగా సహస్ర దీపాలంకార సేవ, వికలాంగులు మరియు వయోవృద్ధుల దర్శనం అక్టోబర్‌ 28న రద్దు చేశారు. అలాగే సోమవారం పెరటాసినెల రద్దీ కారణంగా సోమవారం ఎస్‌ఎస్‌డి టోకెన్లను టిటిడి రద్దుచేసింది. భక్తులు ఈ విషయాన్ని గమనించి తమ తీర్థయాత్రను రూపొందించుకోవాల్సిందిగా టిటిడి కోరుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement