Friday, November 22, 2024

Spl Story | ప్రేమ కోసం యువతి డేరింగ్.. పాక్​​ సరిహద్దులు దాటి అక్రమంగా భారత్​లోకి!

ఆన్​లైన్​లో లూడో గేమ్​ ఆడుతూనే ఒక అబ్బాయి.. అమ్మాయి ప్రేమలో పడ్డారు. అయితే.. ఇక్కడ అబ్బాయిది ఇండియా కాగా, అమ్మాయిది మాత్రం పాకిస్తాన్​.. ఎట్లాగైనా కలుసుకోవాలని, కలిసి జీవితం పంచుకోవాలని వారు నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో అమ్మాయి కాస్త డేర్​ చేసి నేపాల్​ మీదుగా అక్రమంగా ఇండియాలోకి ప్రవేశించింది. వారిద్దరూ బెంగళూరు వెళ్లి పేర్లు మార్చుకుని ఆధార్​ కార్డులు కూడా సంపాదించారు. అయితే.. ఇక్కడే వారి ఫేట్​ మారింది.. ప్రేమ కథ మరో మలుపుతిరిగి ఇద్దరినీ జైలుపాలుచేసింది..

– ఇంటర్నెట్​ డెస్క్​, ఆంధ్రప్రభ

ఆన్‌లైన్‌ LUDO గేమ్‌లో ఉత్తరప్రదేశ్​ యువకుడితో ప్రేమలో పడి.. అతనిని కలుసుకోవడానికి సరిహద్దు దాటి వచ్చిందో పాకిస్థానీ అమ్మాయి. 25 ఏళ్ల యువకుడు ములాయంసింగ్ యాదవ్ తరచుగా ఆన్‌లైన్ లూడో గేమ్ ఆడేవాడు. గేమ్ ఆడుతున్నప్పుడు అతను 19సంవత్సరాల వయస్సు గల ఇక్రా జీవని అనే పాక్​ అమ్మాయితో పరిచం పెంచుకున్నాడు. ఇద్దరూ ప్రేమలో పడటమే కాకుండా కలిసి జీవితాన్ని గడపాలని నిర్ణయించుకున్నారు. తన ప్రేమికుడిని కలిసేందుకు పాకిస్థానీ యువతి అక్రమంగా నేపాల్ మీదుగా భారత్‌కు వచ్చేసింది.

నకిలీ ధ్రువీకరణ పత్రాలు సృష్టించి..

- Advertisement -

పాక్​ అమ్మాయి భారతదేశంలోకి ప్రవేశించిన తర్వాత ఈ జంట బెంగళూరుకు వెళ్లి జున్నసంద్రలోని అయ్యప్ప ఆలయం సమీపంలో అద్దె ఇంట్లో ఉంటోంది. యాదవ్ తన పేరును రావ యాదవ్‌గా మార్చుకున్నాడు. ఆ తర్వాత ఇక్రా కోసం ఆధార్ కార్డ్ ను కూడా రెడీ చేశాడు. వీళ్లిద్దరూ భారతీయ పాస్‌పోర్ట్ కోసం దరఖాస్తు చేశారు. అయితే.. పాకిస్థాన్‌లో ఉన్న తన కుటుంబ సభ్యులను సంప్రదించేందుకు యత్నిస్తున్న ఇక్రాను కేంద్ర నిఘా వర్గాలు ఐడెంటీఫై చేశాయి. కర్నాటక రాష్ట్ర ఇంటెలిజెన్స్ ను అప్రమత్తం చేయడంతో ఈ కేసు వెలుగులోకి వచ్చింది.

అక్రమంగా భారత్‌లోకి ప్రవేశించి నకిలీ పత్రాలు సృష్టించిన ఆ అమ్మాయిని పోలీసులు అరెస్టు చేయడంతో వారి ప్రేమ కథ ముగిసింది. ఫోర్జరీ కేసు కింద యువకుడిని కూడా పోలీసులు అరెస్టు చేశారు. తర్వాత ఇక్రాను FRRO అధికారులకు అప్పగించారు. వారు తదుపరి విచారణలు జరిగే వరకు ఆమెను మహిళల స్టేట్ హోమ్‌కు తరలించి, రిమాండ్​లో ఉంచారు. గతంలో హైదరాబాదీ ప్రేమికుడి కోసం పాకిస్థాన్ యువతి సరిహద్దు దాటేందుకు ప్రయత్నించిన ఘటన కూడా ఉంది.

ఇలాంటి ఘటన ఇంతకుముందు కూడా..

గతేడాది అక్రమంగా భారత్‌లోకి ప్రవేశించేందుకు యత్నించిన పాకిస్థానీ మహిళను సశాస్త్ర సీమా బల్‌ పట్టుకుంది. ఆమెకు సహకరించిన మరో ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని పాకిస్థాన్‌లోని ఫైసలాబాద్‌కు చెందిన కలీజా నూర్, హైదరాబాద్‌కు చెందిన మహమూద్, నేపాల్‌కు చెందిన జీవన్‌గా గుర్తించారు. ఇండో-నేపాల్ సరిహద్దు సమీపంలో ఈ ముగ్గురిని పట్టుకుని స్థానిక పోలీసులకు అప్పగించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement