మొహాలీలో పంజాబ్, లక్నో జట్ల మధ్య జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్ లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేపట్టిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు నష్టపోయి 257 పరుగులు చేసింది. లక్నో అద్భుతమైన బ్యాటింగ్ తో పంజాబ్ బౌలర్లకు చుక్కలు చూపించింది. కాగా, పంజాబ్ జట్టు విజయలక్ష్యాన్ని చేరుకోవాలంటే నిర్ణీత ఓవర్లలో 258 పరుగులు చేయాల్సి ఉంది.
లక్నో కెప్టెన్ రాహుల్ 9 బాల్స్ లో 12 పరుగులు చేసి అవుట్ అవ్వగా.. కైల్ మేయర్స్ 54(7 ఫోర్లు, 4 సిక్స్ లు)తో అర్థ సెంచరీ చేశాడు. ఆయుష్ బదోని 43(3 ఫోర్లు, 3 సిక్స్ లు), మార్కస్ స్టోయినిస్ 72( 6ఫోర్లు, 5 సిక్స లు) తో అత్యదిక రన్స్ చేశాడు. నికోలస్ పూరన్ 45 (7 ఫోర్లు, 1 సిక్స్), దీపక్ హుడా 11 (2 ఫోర్లు), చివరిగా వచ్చని కృనాల్ పాండ్యా 5 రన్లు చేయగా.. పంజాబ్ కు 258 హై టార్గెట్ ని సెట్ చేశారు లక్నో బ్యాటర్లు.