ఐపీఎల్ 2024లో భాగంగా ఇవ్వాల జరిగున్న మ్యాచ్లో లక్నో బ్యాట్స్మెన్ చెలరేగారు. సిక్సులు ఫోర్లతో ఆర్సీబీ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. ఓపెనర్ డికాక్ (81) పరుగులతో విజృంభించి ఐపీఎల్లో 22వ అర్ధశతకం బాదాడు. ఇక చివర్లో వచ్చిన పూరన్ 40 (నాటౌట్) పరుగుల వరద పారించాడు. కెప్టెన్ కేఎల్ రాహుల్ (20), మార్కస్ స్టోయినిస్ (24) పరుగులు చేసి పెవిలియన్ చేరుకున్నారు.
ఆర్సీబీ బౌలర్లలో మ్యాక్స్ వెల్ తన స్పిన్ మాయాజాలంతో రెండు కీలక వికెట్లు పడగొట్టాడు. మహ్మద్ సిరాజ్, యశ్ దయాల్ ఒక్కో వికెట్ తీయగా.. ఆర్సీబీ బౌలర్లకు చుక్కలు చూపించిన డికాక్.. రీస్ టోప్లీ బౌలింగ్ లో ఔటయ్యాడు. ఇక 182 పరుగుల లక్ష్యంతో ఆర్సీబీ ఛేజింగ్ కు దిగనుంది.