ఐపీఎల్ 2024లో లక్నో సూపర్ జేయింట్స్ జట్టు బోణీ కొట్టింది. తమ సొంత మైదానంలో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్‌ను ఓడించి ఈ సీజన్‌లో తొలి విజయం సాధించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో… పంజాబ్ కింగ్స్ ముందు 200 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. అయితే లక్ష్య ఛేదనలో పంజాబ్ కింగ్స్ 5 వికెట్ల నష్టానికి 178 పరుగులకే పరిమితం కావడంతో లక్నో 21 పరుగుల తేడాతో విజయం సాధించింది.
ఛేజింగ్‌లో పంజాబ్ జట్టు పోరాడింది. కెప్టెన్ శిఖర్ ధావన్ (50 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లతో 70) పరుగులతో రాణించాడు. జానీ బెయిర్‌స్టో (42) తృటిలో అర్ధ సెంచరీని కోల్పోయాడు. అయితే, ప్రభసిమ్రాన్ సింగ్ (19), జితేష్ శర్మ (6) పరుగులకే వెనుదిరిగారు. ఇక లియామ్ లివింగ్‌స్టోన్ 28, శశాంక్ సింగ్ 9 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. కాగా, లక్నో బౌలర్లలో మయాంక్ యాదవ్ మూడు వికెట్లు, మొహ్సిన్ ఖాన్ రెండు వికెట్లు తీశారు.
ఇక అంతకముందు బ్యాటింగ్ చేసిన లక్నో.. ఇన్నింగ్స్‌ను దూకుడుగా ప్రారంభించింది. ఓపెనర్ క్వింటన్ డికాక్ (54) హాప్ సెంచరీతో విజృంభించాడు. కెప్టెన్ నికోలస్ పూరం(42), కృనాల్ పాండ్యా (41) పరుగులతో చెలరేగి ఆడారు. మార్కస్ స్టోయినిస్ (19), లోకేష్ రాహుల్ (15) పరుగుల పెవిలియన్ చేరారు. పంజాబ్ బౌలర్లలో సామ్ కర్రాన్ 3 పడగొట్టగా.. అర్ష్‌దీప్ సింగ్ 2 తీసాడు. ఇక కగిసో రబడా, రాహుల్ చాహర్ చెరో వికెట్ దక్కించుకున్నారు.