ఐపీఎల్ 2024 లో భాగంగా నేడు జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా ఘన విజయం సాధించింది. లక్నో సూసర్ జేయింట్స్ను చిత్తుగా ఓడించి పాయింట్స్ టేబుల్ టాపర్‌గా నిలిచింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నైట్‌రైడర్స్.. 235 పరుగులు బాదింది. అనంతరం చేజింగ్ భారీ టార్గెట్‌తో ఛేజింగ్‌కు దిగిన లక్నోను 16.1 ఓవర్లలో 137 పరుగులకే ఆలౌట్ చేసి 98 పరుగుల తేడాతో గెలుపొందింది.
కోల్‌కతా నిర్దేశించిన భారీ ఛేదనలో లక్నోకు ఆదిలోనే షాక్ తగిలింది. ఓపెనర్ అర్నిశ్ కులకర్ణి(9) కే పెవిలియన్ చేరాడు. 20 పరుగులకే తొలి వికెట్ పడిన జట్టును కెప్టెన్ కేఎల్ రాహుల్(25), మార్కస్ స్టోయినిస్(36) పరుగులు చేశారు. వీరి తరువాత వచ్చినవారంతా కోల్‌కతా బౌలింగ్ ముందు చేతులెత్తేశారు. దీంతో 16.1 ఓవర్లలోనే లక్నో జట్టు 137 పరుగులకే కుప్పకూలింది.
కోల్‌కతా బౌలర్లలో వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణా చెరో మూడు వికెట్లు తీయగా… ఆండ్రీ రస్సెల్ రెండు వికెట్లు పడగొట్టారు. ఇక సునీల్ నరైన్, మిచెల్ స్టార్క్ చెరో వికెట్ దక్కించుకున్నారు.