ఏకనా స్టేడియం వేదికగా లక్నోతో జరుగుతున్న మ్యాచ్‌లో కోల్‌కతా విజృంభించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేపట్టిన కోల్‌కతా లక్నో బౌలర్లను ఉతికారేస్తూ.. మరోసారి భారీ స్కోర్ సాధించింది. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 235 పరుగులు బాదింది.
కోల్‌కతా ఓపెనర్ సునీల్ నరైన్ (81) హాఫ్ సెంచరీతో బౌండరీల మోత మోగించాడు. ఫిలిప్ సాల్ట్(32), అంగ్‌క్రిష్ రఘువంశీ(32) చెలరేగారు. కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ (15 బంతుల్లో 23), రమణదీప్ సింగ్ )6 బంతుల్లో 25 పరుగులు నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. దీంతో కోల్‌కతా స్కోర్ భారీగా వెల్లింది.
లక్నో బౌలర్లలో నవీన్ ఉల్ హక్ మూడు వికెట్లు తీయగా… యష్ రవి సింగ్ ఠాకూర్, రవి బిష్ణోయ్, యుధ్వీర్ సింగ్ చరక్ చెరో వికెట్ దక్కించుకున్నారు. ఇక 236 పరుగుల టార్గెట్‌తో లక్నో ఛేజింగ్‌కు దిగనుంది.