Tuesday, November 26, 2024

LSG vs GT | టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ల‌క్నో

ఐపిఎల్‌లో 2024లో నేడు (ఆదివారం) డబుల్ హెడర్‌‌లో భాగంగా జరిగే మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ – లక్నో సూపర్‌జెయింట్స్ జట్లు తలపడనున్నాయి. కాగా, ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన లక్నో జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. లక్నో హోమ్ గ్రౌండ్ అటల్ బిహారీ వాజ్‌పేయి స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ మరికొద్ది సేపట్లో ప్రారంభం కానుంది.

జ‌ట్ల వివ‌రాలు

గుజరాత్ టైటాన్స్ :

శుభమన్ గిల్ (c), కేన్ విలియమ్సన్, శరత్ (wk), విజయ్ శంకర్, రాహుల్ తెవాటియా, నూర్ అహ్మద్, మోహిత్ శర్మ, రషీద్ ఖాన్, ఉమేష్ యాదవ్, దర్శన్ నల్కండే, స్పెన్సర్ జాన్సన్.

లక్నో సూపర్ జెయింట్స్ :

లోకేశ్ రాహుల్ (c & wk), క్వింటన్ డి కాక్, దేవదత్ పడిక్కల్, మార్కస్ స్టోయినిస్, నికోలస్ పూరన్, ఆయుష్ బడోని, కృనాల్ పాండ్యా, రవి బిష్ణోయ్, యశ్ రవిసింగ్ ఠాకూర్, నవీన్-ఉల్-హక్, మయాంక్ యాదవ్.

- Advertisement -

గత మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై అద్భుత విజయం సాధించిన లక్నో…. ఈసారి కూడా అదే జోరు కొనసాగించాలని పట్టుదలతో ఉంది. మరోవైపు పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో భారీ పరుగులు చేసినప్పటికీ.. గుజరాత్ కు ఓటమి తప్పలేదు. ఈ ఓటమి గుజరాత్ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసింది. దీంతో లక్నోపై గెలిచి మళ్లీ ఫామ్ లోకి రావడమే లక్ష్యంగా గుజరాత్ సమరానికి సిద్ధమైంది.

బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో రెండు జట్లు సమతూకంగా కనిపిస్తున్నాయి. కిందటి మ్యాచ్‌లో గిల్ కెప్టెన్సీ ఇన్నింగ్స్‌తో జట్టును ఆదుకున్నాడు. వృద్ధిమాన్ సాహా, కేన్ విలియమ్సన్, సాయి సుదర్శన్, విజయ్ శంకర్, రాహుల్ తెవాటియా, అజ్మతులా ఒమర్‌జాయ్, రషీద్ ఖాన్ తదితరులతో గుజరాత్ బ్యాటింగ్ చాలా బలంగా ఉంది. రషీద్, ఉమేశ్ యాదవ్, మోహిత్ శర్మ, అజ్ముతుల్లా, నూర్ అహ్మద్ వంటి మ్యాచ్ విన్నర్ బౌలర్లు కూడా జట్టులో ఉన్నారు.

మరోవైపు లక్నో జట్టులో క్వింటర్ డి కాక్, కెప్టెన్ రాహుల్, దేవదత్ పడిక్కల్, నికోలస్ పూరన్, స్టోయినిస్, కృనాల్ పాండ్యా తదితరులతో లక్నో బ్యాటింగ్ చాలా బలంగా ఉంది. పూరన్, డి కాక్ ఫామ్‌లో ఉండటం జట్టుకు కంఫర్ట్ ఫ్యాక్టర్. మయాంక్ యాదవ్, నవీనుల్ హక్, కృనాల్, రవి బిష్ణోయ్ లతో బౌలింగ్ లైనప్‌ కూడా బలంగానే ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement