ఐపీఎల్ 2024లో భాగంగా నేడు హోం గ్రౌండ్లో చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్ విజయం సాధించింది. చెన్నై నిర్దేశించిన 177 పరుగుల ఛేదనలో లక్నో ఓపెనర్లు చెలరేగిపోయారు. దీంతో సీఎస్కేపై జట్టు 8 వికెట్ల తేడాతో గెలుపొందింది.
సొంగడ్డపై సీఎస్కేను తక్కువకే కట్టడి చేసిన లక్నోకు ఓపెనర్లు శుభారంభమిచ్చారు. క్వింటన్ డికాక్(54), కెప్టెన్ కేఎల్ రాహుల్(82) చరో హాఫ్ సెంచరీతో చెన్నై బౌలర్లపై విరుచుకుపడుతున్నారు. ఇక ఆ తరువాత వచ్చిన నికోలస్ పూరన్ 23 (నాటౌట్) మెప్పించాడు. దాంతో 19 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసిన లక్నో… 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇక చెన్నై బౌలర్లలో ముస్తాఫిజుర్ రెహమాన్, మతీషా పతిరనా చెరో వికెట్ దక్కించుకున్నారు.