బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దక్షిణ బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ అల్పపీడనం వచ్చే 48 గంటల్లో మరింత బలపడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ఇది పశ్చిమవాయువ్య దిశగా కదులుతూ.. తమిళనాడు తీరానికి దగ్గరగా వచ్చే అవకాశాలున్నాయని వెల్లడించారు. అల్పపీడనం ప్రభావంతో ఈ నెల 4వ తేదీ నుంచి రాయలసీమ, కోస్తాంధ్ర తీరాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు తెలిపారు. తీరం వెంబడి 45-55 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది.
కాగా, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. సముద్రం అల్లకల్లోలంగా ఉన్నందున మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని చెబుతున్నారు. ఇప్పటికే సముద్రం లోపలకు వేటకు వెళ్లిన వారు వీలైనంత త్వరగా తీరానికి చేరుకోవాలని సూచించారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..