Saturday, November 23, 2024

బంగాళాఖాతంలో అల్పపీడనం.. మూడు రోజులపాటు వర్ష సూచన

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : రాగల మూడురోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. బంగాళాఖాతంలో శుక్రవారం ఏర్పడిన అల్పపీడనంగా బలపడిందని, ప్రస్తుతం వాయువ్య బంగాళాఖాతంలో కొనసాగుతుందని పేర్కొంది. అల్పపీడనానికి అనుబంధంగా సముద్రమట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు ఆవర్తనం వ్యాపించి ఉందని తెలిపింది.

ఈ కారణంగా రాగల మూడురోజుల్లో రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది.అక్టోబరు 3 వరకు పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది.ఈ మేరకు రాష్ట్రానికి ఎల్లో అలర్ట్‌ను జారీ చేసింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో పలు జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement