Wednesday, November 20, 2024

New Movie | రొమాంటిక్​ ఎంటర్​టైనర్​గా లవ్​గురు.. విజయ్‌ ఆంటోనీ ఫస్ట్‌ లుక్ రిలీజ్​

విజయ్‌ ఆంటోనీ నటించిన బిచ్చగాడు 2 సినిమా ఇటీవలే విడుదలై మంచి విజయం సాధించింది. విజయ్‌ ఆంటోనీ తాజా చిత్రం లవ్‌ గురు. ఆయన తొలిసారి నటిస్తున్న రొమాంటిక్‌ ఎంటర్‌ టైనర్‌ ఇది. మృణాళినీ రవి హీరోయిన్‌ . వినాయక్‌ వైద్యనాథన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. లవ్‌ గురు సినిమాను తన బ్యానర్‌ గుడ్‌ డెవిల్‌ లో విజయ్‌ ఆంటోనీ నిర్మిస్తున్నారు.

సోషల్‌ మీడియా ద్వారా లవ్‌ గురు సినిమా ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ ను విడుదల చేశారు హీరో విజయ్‌ ఆంటోనీ. ఆయనను రొమాంటిక్‌ ఎంటర్‌ టైనర్‌ లో చూడాలనుకునే అభిమానుల కోరికను ఈ సినిమా తీరనుంది. ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ లో విజయ్‌ ఆంటోనీ, మృణాళినీ రవి జోడీ ఓ మంచి రొమాంటిక్‌ ఎంటర్‌ టైనర్‌ మూవీని చూపించబోతున్న ఫీల్‌ ను కలిగిస్తోంది. ప్రస్తుతం రెగ్యులర్‌ చిత్రీకరణలో ఉన్న ఈ సినిమా వచ్చే ఏడాది వేసవి విడుదలకు ప్లాన్‌ చేసుకుంటోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement