‘ఆర్‌ఎక్స్ 100’తో టాలీవుడ్‌కి పరిచమైంది హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్. తొలి సినిమాతోనే మంచి పాపులారిటీని సొంతం చేసుకుంది. ఆ తర్వాత టాలీవుడ్‌లో వరుస సినిమా అవకాశాలు వచ్చాయి. అయితే ఈ బ్యూటీ ఖాతాలో మాత్రం సరైన హిట్ పడలేదు. దీంతో కొంతకాలం తెలుగు సినిమాలకు గ్యాప్ ఇచ్చి.. ‘మంగళవారం’తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తన కెరీర్‌లో భారీ హిట్ అందించిన ‘ఆర్‌ఎక్స్ 100’ఫేమ్ అజయ్ భూపతి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ నెల 17న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ప్రమోషన్ ల భాగంగా తన ప్రేమకథను వెల్లడించింది.
. మీ క్రష్ ఎవరనే ప్రశ్నకు పాయల్ సమాధానం ఇస్తూ.. ‘స్కూల్ డేస్‌లో ఓ అబ్బాయిని పిచ్చిగా ప్రేమించాను. అతన్ని చూడగానే నాలో ఏదో తెలియని ఆనందం కలిగేది. దాన్నే నేను ప్రేమగా భావించాను. టెన్త్ క్లాస్ ఎండింగ్‌లో నా ప్రేమ విషయాన్ని అతనికి చెప్పాను. కానీ అతను నా లవ్ ప్రపోజ్‌ని రిజెక్ట్ చేశాడు. తనకు ప్రేమపై ఆసక్తి లేదని చెప్పాడు. దీంతో నేను నెలల తరబడి ఏడ్చాను. చదువుపై శ్రద్ద పెట్టలేక పోవడంతో ఆ ఏడాది పరీక్షల్లో ఫెయిల్ అయ్యాను. ఆ విషయాన్ని అమ్మకి చెప్పి ఏడ్చాను. ఆమె నాకు మద్దతుగా నిలిచి.. నేను మళ్లీ మామూలు పరిస్థితికి వచ్చేలా సహాయపడింది అంటూ వెల్లడించింది..