స్టార్ మహిళా క్రికెటర్ స్మృతి మంధాన ఎట్టకేటకు తన ప్రియుడిని సోషల్ మీడియా ద్వారా ప్రపంచానికి పరిచయం చేసింది.. అయిదేళ్లుగా అతడితో రిలెషన్ లో ఉన్నానంటూ ప్రకటించింది. మ్యూజిక్ కంపోజర్ పలాశ్ ముచ్చల్ తో ఉన్న తమ ఐదేళ్ల రిలేషన్‌షిప్‌కు గుర్తుగా స్మృతితో కలిసి కేక్ కట్ చేస్తోన్న ఫొటోలను షేర్ చేసింది..
ఇంతకీ ఎవరీ పలాశ్..?
29 ఏళ్ల పలాశ్ ఒక మ్యూజిక్ కంపోజర్. టీ సిరీస్, జీ మ్యూజిక్, పాల్ మ్యూజిక్ కోసం పలు మ్యూజిక్ వీడియోలు చేశాడు. అలాగే రిక్షా (వెబ్‌సిరీస్), అర్ధ్(సినిమా)కు దర్శకత్వం కూడా వహించాడు. అలాగే ఆశుతోష్ గోవారికర్ దర్శకత్వంలో వచ్చిన ‘ఖేలే హమ్ జీ జాన్ సే’ లో అభిషేక్ బచ్చన్, దీపికా పదుకొణెతో కలిసి నటించాడు. అతడి సోదరి పలక్ ముచ్చల్ కూడా బాలీవుడ్‌లో సింగర్‌గా రాణిస్తున్నారు. గతంలో స్మృతి పియానో వాయిస్తోన్న వీడియోను షేర్ చేసి న్యూ స్టూడెంట్ అంటూ పలాశ్ రాసుకొచ్చాడు.
దశాబ్దకాలంగా భారత మహిళా జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తోన్న స్మృతి ఓ సందర్భంలో కాబోయేవాడి గురించి మాట్లాడుతూ.. ”పెళ్లనేది ప్రతిఒక్కరి జీవితంలో ఓ ముఖ్యమైన ఘట్టం. కాబోయేవాడు ఎలా ఉండాలో ప్రతీ అమ్మాయీ కలలు కంటుంది. అలా నాకూ కొన్ని కలలున్నాయి. అన్నింటికంటే ముఖ్యంగా.. నన్ను చేసుకోబోయేవాడు మంచి మనసున్నవాడై ఉండాలి. నన్ను జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే నా కెరీర్‌ను అర్థం చేసుకోవాలి. కెరీర్ బిజీ అయిపోయి కొన్నిసార్లు నేను తనకు సమయం కేటాయించలేకపోవచ్చు. ఈక్రమంలో నన్ను అర్థం చేసుకొని, ప్రోత్సహించేవాడినే మనువాడతా” అంటూ తన మనసులోని మాటను బయటపెట్టింది.