Saturday, November 16, 2024

జాక్ పాట్.. లాటరీలో రూ. 40 కోట్లు!

తంతే గారెల బుట్టలో పడటం అంటే ఇదేనేమో.. ఓ టాక్సీ డ్రైవర్ కి ఏకంగా లాటరీలో 40 కోట్లు తగిలాయి.. దీనినే అంటారు కాబోలు అదృష్టం అంటే.. కేరళకు చెందిన ఓ వ్యక్తి అబుదాబిలో టాక్సీ డ్రైవర్ గా పని చేస్తున్నాడు. అబుదాబిలో 2008 నుంచి టాక్సీ డ్రైవర్‌గా పనిచేస్తున్న ఇతడు ఇటీవల ఓ లాటరీ టికెట్ కొనుగోలు చేశాడు. అతడు కొనుగోలు చేసిన లాటరీ టికెట్‌కు రూ. 40 కోట్ల జాక్‌పాట్ తగిలింది. తొలుత ఈ విషయాన్ని నమ్మలేని అతడు ఆ తర్వాత తనకు దక్కిన అదృష్టాన్ని చూసి మురిసిపోతున్నాడు. టాక్సీ డ్రైవర్ అయిన 37 ఏళ్ల రెంజిత్ సోమరాజన్ మూడేళ్లుగా లాటరీ టికెట్లు కొంటున్నాడు. గత నెల 29న తన సహచరులైన 9 మందితో కలిసి తలా 100 దిర్హమ్‌లు వేసుకుని తన పేరుపై లాటరీ టికెట్ కొనుగోలు చేశాడు. తాజాగా నిర్వహించిన డ్రాలో ఆ టికెట్‌కు 3 కోట్ల దిర్హమ్‌లు (దాదాపు 40 కోట్లు) తగిలాయి. జాక్‌పాట్ తగిలిన విషయం తెలిసి ఉప్పొంగిపోతున్న సోమరాజన్ మాట్లాడుతూ.. తన సహచరుల్లో భారత్, పాకిస్థాన్, నేపాల్, బంగ్లాదేశ్ వ్యక్తులు ఉన్నారని, వచ్చే మొత్తాన్ని అందరం సమానంగా పంచుకుంటామని తెలిపాడు.

ఇది కూడా చదవండి: టోక్యో ఒలింపిక్స్ కి కరోనా బెడద..

Advertisement

తాజా వార్తలు

Advertisement