Tuesday, November 26, 2024

ఉపాధి లేని అభివృద్ధి వల్ల నష్టం.. ఆర్బీఐ మాజీ గవర్నర్‌ రఘురామ రాజన్‌

భారత్‌ ఆర్థిక వ్యవస్థ సరైన గాడిలో పరుగులు పెడుతోందని ఆర్బీఐ మాజీ గవర్నర్‌ రఘురామ రాజన్‌ ఇటీవల రాయపూర్‌లో వ్యాఖ్యానించారు. ఈ విషయాన్నే ఆర్థిక మంత్రి నిర్మలాసీతారమన్‌ లోక్‌సభలో గణంగా చెప్పుకున్నారు. అదే రఘురామ రాజన్‌ అదే సమావేశంలో ఒక హెచ్చరిక కూడా చేశారు. అదే జాబ్‌లెస్‌ గ్రోత్‌.. ఉపాధిలేని అభివృద్ధి వల్ల దేశానికి చాలా నష్టమని ఆయన గట్టిగానే హెచ్చరించారు. తాజాగా ఆయన ఎన్‌డీటీవీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఈ విషయాన్నే ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. ఉద్యోగాలు కల్పించడం ఆర్థిక వ్యవస్థ లక్ష్యాల్లో ఒకటని ఆయన స్పష్టం చేశారు. ఉపాధి కల్పించలేని ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని ఆయన తేల్చి చెప్పారు.

ప్రతి ఒక్కకూ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరో, ప్రొగ్రాం కన్సల్టెంట్‌ అయిపోవడం మనకు అవసరంలేదన్నారు. యువతలో సామార్ధ్యాలు పెంచే విషయంలో మనం విఫలం అవుతున్నామని రఘురామ రాజన్‌ అభిప్రాయపడ్డారు. వైద్య విద్య కోసం విద్యార్ధులను మనం బలవం తంగా బయటకు పంపిస్తున్నామన్నారు. భారత్‌ గుడ్డిగా చైనా మోడల్‌ తయారీ రంగ ఆధారిత ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చేయాలనే లక్ష్యం బదులు సర్వీస్‌ రంగం వృద్ధిపై దృష్టి పెట్టాలని ఆయన సూచించారు. మంచి డాక్టర్లను విదేశాలకు అందించేలాంటి సర్వీసెస్‌పై ముఖ్యమైనవని చెప్పారు. భారత్‌ అభివృద్ధి విషయంలో ఇతర దేశాలతో పోల్చుకుంటే మెరుగైన గణాంకాలనే నమోదు చేస్తున్నట్లు తెలిపారు. అధిక జనాభా ఉన్నందున ఇంకా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందన్నారు. అందరికీ ఉద్యోగాలు కల్పించేందకు ఎలాంటి దగ్గరిదారులు లేవని, విద్యా, నైపుణ్యాలను పెంచడం ఒక్కటే మార్గమని ఆయన స్పష్టం చేశారు. మనం నైపుణ్యాలను వృద్ది చేస్తే, ఉద్యోగాలు అవే వస్తాయన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement