బిహార్‌లో ఎన్‌డీఏ కూటమి పార్టీ, బీజేపీ మిత్రపక్షం హిందుస్తాన్ ఆవామ్ మెర్చా అధినేత జితన్ రామ్ మంజీ రాముడిపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. తాను రాముడిని విశ్వసించనని, రాముడు దేవుడే కాదని, ఆయన తులసీదాసు, వాల్మికీలు వారి సందేశాలను వ్యాపింపజేయడానికి అల్లుకున్న కథలోని పాత్రే రాముడు అని చెప్పుకొచ్చాడు. బీజేపీ భావజాలంలో కేంద్ర స్థానంలో ఉండే రాముడిపైనే ఆయన ఈ వ్యాఖ్యలు చేయడంతో తీవ్ర దుమారం చెలరేగుతున్నది. వారు రామాయణాన్ని రాశారని, అందులో ఎన్నో మంచి పాఠాలు ఉన్నాయన్నారు. మనం వాటిని నమ్ముతామని, తులసీదాస్, వాల్మికీలను కూడా నమ్ముతామన్నారు.
కానీ రాముడిని కాదన్నారు. మాంజీ కుమారుడు బిహార్‌లోని నితీష్ కుమార్-బీజేపీ ప్రభుత్వ మంత్రివర్గంలో సభ్యుడిగా ఉన్నాడు. బిహార్‌లో అధికారంలో ఉన్న నేషనల్ డెమోక్రటిక్ అలయెన్స్ (ఎన్‌డీఏ) కూటమిలో బీజేపీతో పాటు హిందుస్తాన్ ఆవామ్ మోర్చా కూడా ఉంది. అంబేద్కర్ జయంతి సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో మాంరీ&ు ఈ వ్యాఖ్యలు చేశాడు. రాముడిని విశ్వసిస్తే.. శబరి తిని ఇచ్చిన ఫలాన్ని రాముడు తిన్నాడనే కథను విని ఉంటామని, మీరు మేం తిన్న ఫలాన్ని తినరని, అది సరే.. కానీ.. మేం ముట్టుకున్న ఫలాన్ని అయినా తినండి అంటూ వ్యాఖ్యానించాడు. ప్రపంచంలో రెండే కులాలు ఉన్నాయని, ఒకటి ధనికి, రెండోది పేద అని వివరించారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..