Friday, November 22, 2024

ఘాట్‌రోడ్లలో ప్రమాదాల నివారణకు దీర్ఘకాలిక ప్రణాళికలు : టీటీడీ

తిరుమల, ప్రభన్యూస్‌ : తిరుమల ఘాట్‌రోడ్లలో ప్రమాదాల నివారణకు దీర్ఘకాలిక ప్రణాళికలు సిిద్ధం చేయాలని టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి అధికారులను ఆదేశించారు. ఘాట్‌రోడ్లలో ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తల పై శుక్రవారం టీటీడీ పరిపాలనా భవనంలో జిల్లా కలెక్టర్‌ వెంకటరమణారెడ్డి, జిల్లా ఎస్పి పరమేశ్వర్‌ రెడ్డితో పాటు వివిధ శాఖల అధికారులు, టీటీడీ అధికాలతో ఈవో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేళంలో ఈవో మాట్లాడుతూ, డౌన్‌ ఘాట్‌రోడ్డులో 1వ మలుపు, 7వ మైలు, అలిపిరి డౌన్‌గేట్‌, అప్‌ ఘాట్‌రోడ్డులో లింక్‌రోడ్డు, సహజసిద్దంగా ఏర్పడిన ఆర్చి (గరుడ ఆకారం), దివ్యారామం ప్రాంతాలలో చెక్‌పాయింట్స్‌ ఏర్పాటు చేయాలన్నారు. అప్‌ఘాట్‌రోడ్డులో లాగ డౌన్‌ ఘాట్‌రోడ్డులో కూడా కాంక్రీట్‌ రీటైనింగ్‌ వాల్స్‌ నిర్మించాలన్నారు.

- Advertisement -

ఏ రకమైన వాహనాలను ఘాట్‌రోడ్డులో నిషేదించవచ్చో ప్రణాళికలు సిద్దం చేయాలని సూచించారు. ప్రమాదాల నివారణకు సూచిక బోర్డులను విరివిగా ఏర్పాటు చేయాలన్నారు. ఘాట్‌రోడ్డులో స్పీడ్‌ లిమిట్‌ ఎంత..?, డ్రైవింగ్‌ చేసేటపుడు మొబైల్‌ వాడకం పై నిషేదం, తీసుకోవాల్సిన ఇతర జాగ్రత్తులు తెలిపేలా నిరంతరం కరపత్రాలను పంపిణీ చేయాలన్నారు. అలాగే ఘాట్‌రోడ్డులలో వాహనాల వేగాన్ని గుర్తించి తగిన చర్యలు తీసుకోవడానికి స్పీడ్‌గన్స్‌ ఏర్పాటు చేయాలన్నారు. అంబులెన్సులు, రెస్క్యూ టీమ్‌లు అవసరమైన పరికరాలతో సదా సన్నద్దంగా ఉండాలన్నారు. ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తల పై ఆర్టిసి బస్సుల్లో ఆడియో టేప్‌లు వినిపించే ఏర్పాటు చేయాలన్నారు.

కాగా తిరుమలలో ఉచిత బస్సుల సంఖ్య పెంచాలని, ఘాట్‌ రోడ్డులలో ఆర్టిసి బస్సుల డ్రైవర్లు ఓవర్‌టేక్‌ చేయకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఘాట్‌రోడ్లలో ప్రమాదాలు జరిగిన తక్షణమే రుయాతో పాటు స్విమ్స్‌, బర్డ్‌ ఆసుపత్రిలో వైద్యులు, సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ క్షతగాత్రులకు తక్షణమే మెరుగైన వైద్యసేవలు అందించేలా చర్యులు తీసుకోవాలన్నారు. జేఈవోలు సదాభార్గవి, వీరబ్రహ్మం, సివిఎస్‌వో నరసింహ కిషోర్‌, ఎఫ్‌ఏసిఏవో బాలాజి, చీఫ్‌ ఇంజనీర్‌ నాగేశ్వరరావు, టిటిడి ఇంజనీరింగ్‌ సలహాదారు రామచంద్రారెడ్డి, స్విమ్స్‌ డైరెక్టర్‌ డా||వెంగమ్మ, బర్డ్‌ ఆసుపత్రి ప్రత్యేకాధికారి డా||రెడ్డెప్పరెడ్డి, రుయూ సూపరింటెండెంట్‌ డా||రవిప్రభు, అదనపు ఎస్పి మునిరామయ్య, ఆర్టిసి ఆర్‌ఎం చెంగల్‌రెడ్డి, ఇన్‌చార్జ్‌ ఆర్టివో రవీంద్రనాథ్‌లు సమావేశంలో పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement