18వ లోక్‌సభ తొలి సమావేశాలు ప్రారంభమయ్యాయి. జూలై 3 వరకు జరిగే ఈ సెషన్‌లో రెండో రోజు కొత్త ఎంపీలు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సమావేశాల తొలిరోజే 262 మంది ఎంపీలు ప్రమాణ స్వీకారం చేశారు.
ఈరోజు మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల మధ్య రాహుల్ గాంధీ, అఖిలేష్ యాదవ్, డింపుల్ యాదవ్ సహా 270 మంది ఎంపీలు లోక్‌సభ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
అంతకుముందు సోమవారం ప్రధాని మోడీ ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు.ఈరోజు లోక్‌సభ స్పీకర్ ఎన్నికకు పేరు ఖరారు కానుంది. ఇక బుధవారం పార్లమెంట్‌లో కొత్త లోక్‌సభ స్పీకర్ ఎన్నిక అనంతరం రాష్ట్రపతి గురువారం ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు. ప్రొటెం స్పీకర్ నియామకంతో పాటు నీట్-యూజీ పేపర్ లీక్, ఇతర పోటీ పరీక్షల వాయిదా వ్యవహారంలో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు విపక్షాలు వ్యూహరచన చేశాయి.దీంతో సభలో గందరగోళం నెలకొనే అవకాశాలు కనిపిస్తున్నాయి