Saturday, June 29, 2024

Lok Sabha – వ‌య‌నాడ్ స్థానానికి రాహుల్ గాంధీ రాజీనామా… ఆమోదించిన ప్రొటెం స్పీకర్

కేరళలోని వాయనాడ్ లోక్‌సభ స్థానానికి రాహుల్ గాంధీ చేసిన రాజీనామా ఆమోదం పొందింది. సోమవారం 18వ లోక్‌సభ మొదటి సెషన్ ప్రారంభంలో ప్రొటెం స్పీకర్ భర్తృహరి మహతాబ్ ఈ సమాచారాన్ని ప్ర‌క‌టించారు. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో రాహుల్ గాంధీ రెండు స్థానాల నుంచి గెలిచారు. రెండింటిలో ఆయన రాయ్‌బరేలీ నుంచే కొనసాగాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయన కేరళలోని వయనాడ్‌ ఎంపీ స్థానానికి రాజీనామా చేశారు. రాహుల్‌ గాంధీ రాజీనామాను ఆమోదించినట్లు లోక్ సభ సెక్రటేరియట్‌ ప్రకటించింది. ఈ మేరకు బులిటెన్‌ విడుదల చేసింది. రాహుల్‌ వయనాడ్‌, రాయ్‌బరేలీ.. ఈ రెండు స్థానాల నుంచి ఎంపీగా ఎన్నికయ్యారని, వయనాడ్‌ ఎంపీగా ఆయన చేసిన రాజీనామాకు ఆమోదం లభించినట్లు పేర్కొంది.

రెండు స్థానాల్లో పోటీ చేసి గెలిస్తే.. ఎన్నికైన 14 రోజుల్లోగా ఒక స్థానాన్ని రాహుల్‌ వదులుకోవాల్సి ఉంటుంది. దీంతో నిబంధనను అనుసరించి వయనాడ్‌ను వదులుకున్నారు. ఇకపై ఆయన రాయ్‌బరేలి ఎంపీగా కొనసాగనున్నారు. ఇక వ‌య‌నాడ్ నుంచి ప్రియాంకా గాంధీ పోటీ చేయ‌నున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement