వాయిదా తీర్మానం ఇచ్చిన విపక్షం
రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానం
దానికి ముందే చర్చించాలని పట్టు
అధికార, విపక్షం నుంచి విద్యార్థులకు స్పష్టమైన సందేశం వెళ్లాలి
పట్టువీడని లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ
12 గంటల వరకు సభ వాయిదా వేసిన స్పీకర్
అటు రాజ్యసభలోనూ ఇదే గందరగోళం
లోక్‌సభలో నీట్ పరీక్ష పేపర్ లీకేజీ ఘటనపై శుక్రవారం దుమారం రేగింది. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చను నిలిపివేసి.. నీట్ పరీక్షపై ఇచ్చి వాయిదా తీర్మానంపై చర్చించాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. దీనిపై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మాట్లాడారు. నీట్ పరీక్ష గురించి సభలో చర్చించాలని రాహుల్ పట్టుబట్టారు. ఇరువైపుల నుంచి విద్యార్థులకు సందేశం ఇవ్వాలని ఆశిస్తున్నానని తెలిపారు. ప్రభుత్వం వైపు నుంచి, విపక్షాల వైపు నుంచి నీట్ పరీక్ష గురించి విద్యార్థులకు తెలియజేస్తామని రాహుల్ అన్నారు. నీట్‌పై ప్రత్యేక చర్చ చేపట్టాలని డిమాండ్ చేశారు.
ప్రారంభమైన కాసేపటికే వాయిదా..
స్పీకర్ ఓం బిర్లా మాట్లాడుతూ.. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానం చేపట్టడానికి ముందు ఎటువంటి వాయిదా తీర్మానాలను స్వీకరించరు అని స్పష్టం చేశారు. కానీ, మరో వైపు విపక్ష ఎంపీలు మాత్రం తమ పట్టువీడలేదు. నీట్‌పై చర్చ చేపట్టాలంటూ నినాదాలు చేశారు. దీంతో సభను 12 గంటల వరకు స్పీకర్ వాయిదా వేశారు. రాజ్యసభలో కూడా నీట్ అంశంపై రచ్చ జరుగుతోంది. పేపర్ లీకేజీపై ఖర్గే ఆరోపణలను చేశారు. దీంతో సభలో గందరగోళం ఏర్పడింది. ఈ నేపథ్యంలో చైర్మెన్ జగదీప్ ధన్‌కర్ సభను 12 గంటల వరకు వాయిదా వేశారు.