న్యూఢిల్లీ: కాంగ్రెస్ వైఖరి వల్లే ప్రజాస్వామ్యానికి, దేశానికి నష్టమని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు. కాంగ్రెస్ అంటేనే వారసత్వ రాజకీయాలని మోడీ పేర్కొన్నారు. ఎవరేమన్నా వచ్చే ఎన్నికల్లో మూడో సారి విజయం సాధిస్తామని మోడీ ధీమాను వ్యక్తం చేశారు. .
రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే చర్చకు సోమవారం నాడు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సమాధానమిచ్చారు.అబ్ కీ బార్ మోడీకి సర్కార్ అని ఆయన ధీమాను వ్యక్తం చేశారు. మూడో టర్మ్ లో పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకోబోతున్నామన్నారు. వంద రోజుల్లో మరోసారి తమ ప్రభుత్వం ఏర్పడబోతుందన్నారు.ఎన్‌డీఏకు 400కు పైగా సీట్లు వచ్చినట్టుగా మోడీ చెప్పారు. బీజేపీకి స్వంతంగా 370కి పైగా సీట్లు వస్తాయన్నారు.
భగవాన్ రాముడు తన స్వంత ఇంటికి వచ్చాడన్నారు.ఎన్‌డీఏకు 400కు పైగా సీట్లు వస్తాయని మోడీ ధీమాను వ్యక్తం చేశారు.తాము మూడో దఫా అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రపంచంలో భారత్ మూడో అతిపెద్ద ఆర్ధిక వ్యవస్థగా అవతరించనుందన్నారు. 2014లో ప్రపంచంలో 11వ ఆర్ధిక వ్యవస్థగా ఉన్న ఇండియా ప్రస్తుతం ఐదవ స్థానానికి చేరుకున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
11వ, స్థానంలో ఉన్న ఆర్ధిక వ్యవస్థను చూసి గొప్పలు చెప్పుకున్నారని కాంగ్రెస్ పై మోడీ విమర్శలు చేశారు.కానీ తమ ప్రభుత్వం ఇండియాను ఐదో స్థానానికి తీసుకు వచ్చిందన్నారు.విపక్షాలు చాలా కాలంగా అక్కడే ఉండాలని తీర్మానించుకున్నాయని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చెప్పారు.దశాబ్దాల తరబడి అధికారంలో ఉన్నందున దశాబ్దాల తరబడి విపక్షంలో ఉండాలని విపక్షాలు భావిస్తున్నాయని ఆయన సెటైర్లు వేశారు.విపక్షాల కోరికను భగవంతుడు నెరవేరుస్తారని భావిస్తున్నట్టుగా నరేంద్ర మోడీ చెప్పారు. ఎన్నికల తర్వాత విపక్షాలు ప్రేక్షకుల సీట్లకే పరిమితమౌతాయన్నారు.
పదేళ్లు విపక్షంలో ఉన్నా కూడ కాంగ్రెస్ తీరులో మార్పు రాలేదని ఆయన విమర్శించారు. మహిళలు, యువత, పేదలు రైతులపై దేశాభివృద్దిపై ఆదారపడి ఉందని మోడీ చెప్పారు.మైనార్టీల పేరిట ఎంతకాలం రాజకీయాలు చేస్తారని ఆయన ప్రశ్నించారు. మైనార్టీలు అంటే ఎవరన్నారు. మహిళలు మైనారిటీలు కారా, రైతులు మైనారిటీలు కారా అని ఆయన అడిగారు.ఎంతకాలం విభజన రాజకీయాలు చేస్తారని ఆయన ప్రశ్నించారు.రాజ్ నాథ్ సింగ్, అమిత్ షాలకు స్వంత పార్టీలు లేవన్నారు.వారసత్వ పాలనకు మల్లికార్జున ఖర్గే, గులాం నబీ ఆజాద్ బాధితులయ్యారన్నారు. తాము మేకిన్ ఇండియా అంటుంటే కాంగ్రెస్ క్యాన్సిల్ అంటుందన్నారు