Friday, November 22, 2024

యూపీకి మిడతల దండు ముప్పు.. 17 జిల్లాల్లో హై అలర్ట్

ఒకవైపు కరోనా వైరస్, బ్లాక్ ఫంగస్ మహమ్మారితో ప్రజలు బెంబేలెత్తుతుండగా, మరోవైపు మిడతల దండు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోకి ప్రవేశిస్తుందని వ్యవసాయశాఖ అధికారులు చేసిన హెచ్చరికలతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

రాజస్థాన్ రాష్ట్రంలోని జైసల్మేర్ నగరంలో మిడతల దండును అధికారులు గుర్తించారు. అలీఘడ్ జిల్లాలోని పొలాల్లోకి మిడతల దండు ప్రవేశించే అవకాశముందని జిల్లా అధికారులు, వ్యవసాయ శాఖ అధికారులు హెచ్చరించారు. మిడతల దండు ప్రవేశించే అవకాశమున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వ్యవసాయ శాఖ అధికారులు హెచ్చరించారు. రైతులు పంటలను మిడతల దండు నుంచి కాపాడుకోవాలని, అప్రమత్తంగా ఉండాలని వ్యవసాయశాఖ అధికారులు రైతులకు సూచించారు. అసలే కరోనా, బ్లాక్ ఫంగస్ మహమ్మారులతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజలకు మిడతల దండు దాడి చేస్తుందన్న వార్త కలవరం కలిగించింది. గతేడాది పాకిస్తాన్ నుండి భారత్ లోకి ప్రవేశించిన మిడతలు.. ఐదు రాష్ట్రాలను భయపెట్టాయి. వందలాది ఎకరాల్లోని పంటను నాశనం చేశాయి. ఇప్పుడు మళ్లీ ఉత్తరాది రాష్ట్రాల్లో తిరుగుతున్నాయి. దీంతో ఉత్తరప్రదేశ్ లోని 17 జిల్లాలను అధికారులు అప్రమత్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement