తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో లాక్ డౌన్ ను ఈనెలాఖరు వరకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం కొనసాగుతున్న ఆంక్షలు మే 30 వరకు కొనసాగుతాయని ప్రభుత్వం ప్రకటించింది. మే 12 ఉదయం 10 గంటల నుంచి 10 రోజుల పాటు లాక్డౌన్ అమలు చేయాలని తొలుత కేబినెట్ నిర్ణయించింది. కాగా ఇప్పటికే ఏడు రోజులు గడిచింది. ఇక రేపటి నుంచి కూడా ఇవే ఆంక్షలు కొనసాగుతాయని ప్రతిరోజు ఉదయం 6 గంటల నుండి 10 గంటల వరకు ప్రజలు బయటకు వచ్చే వెసులుబాటును ప్రభుత్వం కల్పించింది. అయితే మొదట లాక్ డౌన్ పొడిగించే విషయమై ఈ నెల 20న క్యాబినెట్ సమావేశం నిర్వహించి నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు .కానీ అంతకన్నా ముందే ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement