Saturday, November 23, 2024

కరోనా సెకండ్ వేవ్.. నరసరావుపేటలో లాక్ డౌన్

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా రోజువారీగా నమోదవుతున్న కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. కొన్నిచోట్ల ప్రజలు, వ్యాపారస్తులు స్వీయ లాక్ డౌన్ విధించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికే మూడు జిల్లాల్లో అక్కడక్కడా ప్రజలు వ్యాపారస్తులు లాక్ డౌన్ నిబంధనలు పాటిస్తున్నారు. కరోనా సెకండ్ వేవ్ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో గుంటూరు జిల్లా నరసరావుపేట లాక్ డౌన్ విధించారు. ఎల్లుండి నుండి 15 రోజులు పాటు లాక్ డౌన్ కొనసాగనుంది. ఉదయం 8:00 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటలకు వరకు మాత్రమే అన్ని వ్యాపార సంస్థలు పని చేస్తాయి. మూడు గంటల తర్వాత సంపూర్ణ లాక్ డౌన్ కొనసాగనుంది. ఈ మేరకు నరసరావుపేట సబ్-కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.

కాగా, ఇప్పటికే తెలంగాణలో నైట్ కర్ఫ్యూ విధించారు. ఆంధ్రప్రదేశ్ లో రోజువారీ కరోనా కేసుల సంఖ్య భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ఏ క్షణం అయినా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంటుందన్న ప్రచారం జరుగుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement