కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరుగుతుండటంతో ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్టలో అధికారులు లాక్‌డౌన్ విధించారు. బుధవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి ఇది ప్రారంభమవుతుంది. బుధవారం నుంచి పది రోజులపాటు అమల్లో ఉండనుంది. ప్రతిరోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 5 గంటల వరకు ఆంక్షలు విధిస్తున్నారు. దీంతో ప్రతి రోజు ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు వ్యాపారులు తమ వ్యాపార కలాపాలు కొనసాగించుకోవచ్చని యాదగిరిగుట్ట మున్సిపల్ చైర్‌పర్సన్ ఎరుకల సుధ వెల్లడించారు. లాక్‌డౌన్ నుంచి పాలు, పండ్లు, కూరగాయలు, కిరాణం, మెడికల్ షాపులు మినహాయింపు ఉంటుందని తెలిపారు. మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఇళ్ల నుంచి బయటకు రావొద్దని సూచించారు. మరోవైపు ఆత్మకూరు(ఎం) మండలంలో కూడా వారం రోజుపాటు లాక్‌డౌన్ అమలులో ఉండనుంది. ప్రతిరోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి.
యాదగిరిగుట్టలో 10 రోజులు లాక్‌డౌన్
By ramesh nalam
- Tags
- breaking news telugu
- Corona lock down
- CORONA VIRUS
- important news
- Important News This Week
- Important News Today
- latest breaking news
- Latest Important News
- latest news telugu
- LOCK DOWN
- Most Important News
- Nallagonda
- Nallagonda News
- Nallagonda News Live
- telangana
- telugu breaking news
- Telugu Daily News
- telugu epapers
- Telugu Important News
- telugu latest news
- telugu news online
- Telugu News Updates
- telugu trending news
- Today Nallagonda News
- Today News in Telugu
- Top News Stories
- Top News Stories Today
- Top News Today
- Top Stories
- Top Stories Today
- Trending Stories
- viral news telugu
- Yadagirigutta
Previous article
Next article
మరిన్ని వార్తలు
Advertisement
తాజా వార్తలు
Advertisement