Tuesday, November 26, 2024

ఉగాండాలో లాక్‌డౌన్‌.. ఎబోలా వైరస్‌ నివారణకు నైట్ కర్ఫ్యూ..

ఎబోలా వైరస్‌ కేసుల సంఖ్య తీవ్రం కావడంతో దేశంలో లాక్‌డౌన్‌ విధిస్తున్నట్లు ఉగాండా అధ్యక్షుడు యెవెరిమ్యుసెవెని శనివారం నైరోబీలో ప్రకటించారు. రాత్రిపూట కర్ఫ్యూ విధించడంతో పాటు, ప్రార్థనాస్థలాలు, సినిమాహాళ్లను మూసివేస్తున్నట్లు ప్రెసిడెంట్‌ ప్రకటించారు. ఎబోలా వైరస్‌ ప్రభావం తీవ్రంగా ఉన్న రెండు జిల్లాల్లో 21 రోజుల పాటు ఇతరుల ప్రవేశాన్ని నిషేధిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఎబోలా వైరస్‌ను నియంత్రించడానికి ఈ చర్యటు తీసుకున్నట్లు ఆయన శనివారం జాతిని ఉద్దేశించి టెలివిజన్‌లో ప్రసంగిస్తూ, ఈ ప్రకటన చేశారు.

ఎబోలా వైరస్‌ నియంత్రణకు ప్రభుత్వం ప్రకటించిన లాక్‌డౌన్‌ తాత్కాలిక చర్యని, ప్రజలు, ప్రభుత్వం సంయుక్తంగా కృషి చేయడం ద్వారా ఎబోలాను పూర్తిస్థాయిలో నిర్మూలించవచ్చని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఎబోలా వైరస్‌ కారణంగా సోకిన జ్వరం తీవ్రతకు ఉగాండాలో ఇప్పటికే 19 మంది మృతి చెందినట్లు దేశాధ్యక్షుడు మ్యుసెవెని ప్రకటించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement