కరోనా కట్టడికి దేశ రాజధానిలో అమలు చేస్తున్న లాక్‌డౌన్‌ను కేజ్రీవాల్ ప్రభుత్వం మరోసారి పొడిగించింది. తాజాగా ఈనెల 24 వరకు లాక్‌డౌన్ ఉంటుందని ఢిల్లీ ప్రభుత్వం వెల్లడించింది. లాక్‌డౌన్ పొడిగిస్తూ కేజ్రీవాల్ సర్కారు నిర్ణయం తీసుకోవడం ఇది ఐదోసారి.
లాక్‌డౌన్‌ను అమల్లోకి తీసుకొచ్చిన మూడోవారం నుంచి ఢిల్లీలో కరోనా వైరస్ తీవ్రత కొంత తగ్గుముఖం పట్టింది. గతంతో పోల్చుకుంటే అక్కడ పాజిటివిటీ రేటు గణనీయంగా తగ్గింది. ఇంతకుముందు 35 శాతం మేర రికార్డవుతూ వచ్చిన రోజువారీ కరోనా వైరస్ పాజిటివ్ రేటు..తొలుత 23 శాతానికి తగ్గింది. అక్కడి నుంచి మళ్లీ 11 శాతానికి దిగజారింది. ఢిల్లీ వైద్యాధికారులు శనివారం సాయంత్రం విడుదల చేసిన బులెటిన్ ప్రకారం.. అక్కడ నమోదైన కొత్త కేసులు 6,500 మాత్రమే. శుక్రవారం కూడా 8,500 కేసులే నమోదయ్యాయి.