Thursday, November 21, 2024

జగిత్యాల జిల్లాలో మరోసారి లాక్‌డౌన్..

తెలంగాణ‌లో క‌రోనా కేసులు తగ్గుముఖం పట్టినప్పటికి కొన్ని జిల్లాల్లో కేసులు అనూహ్యంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా కరీంనగర్, జగిత్యాల జిల్లాలో కేసుల పెరుగుదల భారీగా ఉంటోంది. కాగా కరీంగనర్ జిల్లాలో ఇవాళ్టి నుంచి కఠిన ఆంక్షలు విధిస్తున్నట్లు అధికారుల ఇప్పటికే ప్రకటించారు. కాగా నేటి నుంచి మాస్క్ లు ధరించకుంటే చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. అంతేకాదు నిబంధనలు పాటించని వారికి జైలు శిక్ష కూడా విధిస్తామని హెచ్చరించారు.ఇక జగిత్యాల జిల్లాలోను మరోసారి లాక్ డౌన్ విధించారు. గొల్ల‌ప‌ల్లి మండ‌లంలోని వెలుగుమ‌ట్ల గ్రామంలో ఇప్ప‌టికే స్వ‌చ్చందంగా లాక్‌డౌన్ ప్ర‌క‌టించారు.  సోమ‌వారంతో ఆ గ్రామంలో లాక్‌డౌన్ ముగిసింది.  అయిన‌ప్ప‌టికి కేసులు న‌మోద‌వుతుండ‌టంతో పాటుగా సోమ‌వారం రోజున క‌రోనాతో ఒక‌రు మృతి చెంద‌డంతో లాక్‌డౌన్‌ను మ‌రో 15 రోజుల‌పాటు పెంచుతూ గ్రామ‌పంచాయ‌తి నిర్ణ‌యం తీసుకుంది. గ్రామ‌పంచాయ‌తీ విధించిన లాక్‌డౌన్‌ను ఎవ‌రైనా ఉల్లంఘిస్తే రూ.1000 జ‌రిమానా విధిస్తామ‌ని హెచ్చ‌రించింది. ఈరోజు నుంచి 15 రోజుల పాటు ఆ గ్రామంలో లాక్ డౌన్ అమ‌ల్లో ఉంటుంద‌ని పంచాయ‌తీ అధికారులు చెబుతున్నారు.  దీంతో స్వచ్ఛందంగా గ్రామాల ప్రజలు సెల్ఫ్ లాక్ డౌన్ పాటిస్తున్నారు. వైరస్ వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

ఇప్పటికే వెల్గటూర్ మండలం ఎండపల్లి, మద్దుట్లలో కరోనా కేసులు పెరగడంతో లాక్ డౌన్ విధించారు. ఆగస్టు ఫస్ట్ తో లాక్ డౌన్ ని ఎత్తివేశారు. కరోనా థర్డ్ వేవ్ భయంతో సెల్ఫ్ లాక్ డౌన్లతో గ్రామాలు కట్టడి చేస్తున్నాయి.  జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం వెలుగుమట్లలో స్వచ్ఛంద లాక్ డౌన్ విధించారు. కాగా సోమవారం కరోనాతో ఒకరు చనిపోయారు. గ్రామంలో ఇప్పటి వరకు 35 కరోనా కేసుల నమోదయ్యాయి. మంగళవారం నుంచి పదిహేను రోజుల పాటు లాక్ డౌన్ విధిస్తూ గ్రామ పంచాయతీ తీర్మానం చేసింది. 

ఇది కూడా చదవండి: వనపర్తి జిల్లాలో వింత జంతువు సంచారం

Advertisement

తాజా వార్తలు

Advertisement