Tuesday, November 26, 2024

యూపీలో రేపటి నుంచి లాక్‌డౌన్

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా కట్టడికి ఢిల్లీ, మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాలు చూపించిన బాటలోనే అడుగులు వేయాలని నిర్ణయించుకుంది. రేపటి నుంచి ఐదు రోజుల పాటు అంటే ఈ నెల 30 సాయంత్రం నుంచి మే 4 ఉదయం వరకూ సంపూర్ణ లాక్ డౌన్ విధించాలని నిర్ణయించుకుంది. అత్యవసర సర్వీసులు మినహా అన్ని బంద్ చేస్తున్నట్లు యోగి ఆదిత్యనాథ్ సర్కార్ ప్రకటించింది. క‌రోనా వైర‌స్ సెకండ్ వేవ్ విరుచుకుప‌డ‌టంతో యూపీలో కేసుల తీవ్రత‌ చాలా ఎక్కువగా పెరిగింది. రోజుకి వేలల్లో కేసులు నమోదవుతున్నాయి. వందల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి. స్వయంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రే కరోనా బారిన పడ్డాడంటే అక్కడ పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు.

కరోనా చైన్ బ్రేక్ చేయడానిక ప్రభుత్వం అనేక కఠిన ఆంక్షలు విధించింది. వీకెండ్ లాక్ డౌన్, నైట్ కర్ఫ్యూ విధించిన పెద్దగా ప్రయోజనం లేకపోవడంతో కరోనా కట్టడి కాకపోవడంతో చివరి అస్ర్తంగా లాక్ డౌన్‌ను పెడుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. మరోవైపు కేసుల పెరుగుద‌ల‌తో ప‌లు రాష్ట్రాలు వారాంతాల్లో లాక్‌డౌన్, నైట్ క‌ర్ఫ్యూ వంటి ప‌లు నియంత్రణ‌ల‌ను అమ‌లు చేస్తున్నాయి. మ‌రోవైపు వ్యాక్సినేష‌న్ ప్రక్రియ‌ను ముమ్మరం చేయ‌డంతో పాటు ఆక్సిజ‌న్ బెడ్లు, మందుల కొర‌త‌ను అధిగ‌మించేందుకు చ‌ర్యలు చేప‌డుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement