Tuesday, November 26, 2024

టాలీవుడ్.. కోలీవుడ్ లో లోకల్ నాన్ లోకల్ వివాదం.. ఏం జరగనుందో..!

ప్రస్తుతం టాలీవుడ్..కోలీవుడ్ లో లోకల్ నాన్ లోకల్ అంటూ వివాదం రాజుకుంది. కాగా ఇప్పటికే సంక్రాంతి పండగ సమయంలో తెలుగు సినిమాలు మాత్రమే రిలీజ్ అంటూ తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి ప్రకటించిన నేపథ్యంలో తమిళనాడులో కూడా లోకల్ వెర్సస్ నాన్ లోకల్ వివాదం నెలకొంది. తాజాగా నామ్ తమిళర్ కట్చి అధినేత, దర్శకుడు సీమాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమిళ స్టార్ హీరో విజయ్ వారిసు ( వారసుడు ) సినిమాను తెలుగు రాష్ట్రాలలో రిలీజ్ కాకుండా అడ్డుకుంటే తమిళనాడు లో తెలుగు సినిమాల రిలీజ్ ను అడ్డుకుంటామని హెచ్చరించారు. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతికి విజయ్ వారిసు సినిమా విడుదలపై తెలుగు నిర్మాతల మండలి అభ్యంతరం చెప్పింది.

అంతేకాదు 2023 సంక్రాంతికి డబ్బింగ్ సినిమాలు విడుదల చేయకూడదని తెలుగు నిర్మాతల మండలి ఓ లేఖను రిలీజ్ చేసింది. అయితే తెలుగు నిర్మాతల మండలి నిర్ణయాన్ని నామ్ తమిళర్ కట్చి అధినేత దర్శకుడు సీమాన్ ఖండించారు. బాహుబలి , ఆర్ఆర్ఆర్ , కెజిఎఫ్ , కాంతారా వంటి డబ్బింగ్ సినిమాలు తమిళనాడులో కూడా విజయం సాధించాయని గుర్తు చేశారు. అంతేకాదు తమిళనాడులో ఈ సినిమాల విడుదలకి తాము ఎటువంటి అభ్యంతరం చెప్పలేదని గుర్తు చేశారు. అయితే ఇప్పుడు కోలీవుడ్ సినిమాల విడుదలకి మాత్రం ఎందుకు తెలుగు నిర్మాతలు అభ్యంతరం చెబుతున్నారని దర్శకుడు సీమాన్ ప్రశ్నించారు. తెలుగు నిర్మాతల మండలి వెంటనే తమ నిర్ణయాన్ని మార్చుకోవాలని.. లేనిపక్షం లో తెలుగు సినిమాల విడుదలని తమిళనాడులో రిలీజ్ కాకుండా అడ్డుకుంటామని సీమాన్ హెచ్చరించారు.ఈ నేపథ్యంలో తెలుగు నిర్మాతల మండలి ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement