Tuesday, November 26, 2024

స్టేషన్ ఘన్‌పూర్‌లో మంత్రి ఎర్రబెల్లికి నిరసన సెగ

స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గంలో పర్యటన సందర్భంగా మంత్రి ఎర్రబెల్లికి నిరసన సెగ తగిలింది. జనగామ జిల్లా పాలకుర్తి నుంచి వరంగల్ జిల్లా కేంద్రానికి వెళ్తున్న ఎర్రబెల్లి.. స్టేషన్ ఘన్‌పూర్ చేరుకోగానే వ్యాపారులు కాన్వాయ్‌కు అడ్డు తగిలారు. గత ఏడాదిగా రహదారి పనులు నత్తనడకన సాగుతున్నాయని అసంతృప్తి వ్యక్తం చేశారు.

గాంధీ చౌరస్తా నుంచి రైల్వే గేట్ వరకు చేపట్టిన రోడ్డు విస్తరణ పనులు నేటికీ పూర్తికావడం లేదన్నారు. గత నెల 30న కూడా కాన్వాయ్‌ను ముట్టడించామని, అయినప్పటికీ పనుల్లో పురోగతి లేదన్నారు. అందుకే మరోసారి అడ్డుతగిలినట్లు చెప్పుకొచ్చారు. మరోవైపు డివిజన్ కేంద్రంలో ఫైర్ స్టేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. వ్యాపారుల సమస్యను మరోసారి విన్న మంత్రి ఎర్రబెల్లి.. రోడ్డుపై తనను ఆపడం సరికాదన్నారు. ఏదైనా ఉంటే తన కార్యాలయానికి వచ్చి చెప్పాలని సూచించారు.

ఈ వార్త కూడా చదవండి: ములుగులో క్షుద్రపూజల కలకలం

Advertisement

తాజా వార్తలు

Advertisement