అంధ్రప్రభ స్మార్ట్ – హైదరాబాద్ – సిఎం రేవంత్ రైతులు శుభవార్త వినిపించారు.. లక్ష రూపాయిలు లోపు రుణం తీసుకున్న రైతుల రుణాలను ఈ నెల 18వ తేదిన మాఫీ చేయనున్నట్లు ప్రకటించారు.. అదే రోజున మొత్తం రుణ మాఫీ ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు.. అదే రోజు సాయంత్రం లక్ష లోపు రుణాలు పొందిన రైతుల బ్యాంక్ ఖాతాలలో నిధుల జమ చేయనున్నట్లు రేవంత్ తెలిపారు.
కలెక్టర్లతో ఇవాళ సచివాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో రైతు రుణమాఫీకి రేషన్ కార్డు తప్పనిసరి అనే నిబంధన కుటుంబ గుర్తింపు కోసమేనని తెలిపారు… భూమి పాస్ బుక్‌ల ఆధారంగానే కుటుంబానికి రూ.2 లక్షల రుణమాఫీ వర్తిస్తుందని పేర్కొన్నారు.
ఇక రైతుల బ్యాంక్ ఖాతాలలో డబ్బు జమ చేసిన వెంటనే . రైతు వేదికల్లో రుణమాఫీ లబ్ధిదారులో సంబురాలు నిర్వహించాలని, వీటికి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు హాజరు కావాలని సీఎం రేవంత్ సూచించారు. మరోవైపు.. రుణమాఫీ నిధులు పక్కదారి పట్టకుండా బ్యాంకర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. రుణమాఫీ కోసం ప్రభుత్వం విడుదల చేసిన నిధులను ఇతర ఖాతాల్లో జమచేసుకుంటే బ్యాంకర్లపైనా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.