Wednesday, November 20, 2024

మళ్లీ రెచ్చిపోతున్న లోన్‌ యాప్స్‌ నిర్వాహకులు.. కొత్తగా 291 లోన్స్ యాప్సా గుర్తింపు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : హైదరాబాద్‌లో లోన్‌ యాప్‌ నిర్వాహకులు మళ్లి రెచ్చిపోతున్నారు. గతంలో లోన్‌ తీసుకున్నవారిని యాప్‌ నిర్వాహకులు వేధింపులకు గురిచేస్తున్నారు. అంతేకాకుండా లోన్‌ తీసుకోకపోయినా బలవంతంగా చిత్రహింసలు పెడుతున్నారు. ఈ క్రమంలోనే బాధితులు సైబర్‌ క్రైమ్‌ పోలీసులను ఆశ్రయిస్తున్నారు. ఇందుకు సంబంధించి కొద్ది రోజుల్లోనే సైబర్‌ క్రైమ్‌ పోలీసులు 50 కేసులు నమోదు చేశారు. ఈ క్రమంలోనే విచారణ చేపట్టిన పోలీసులు 291 కొత్త లోన్‌ యాప్‌లను గుర్తించారు. లోన్‌ యాప్స్‌ను గూగుల్‌ ప్లేస్టోర్‌ నుంచి తొలగించాలని సైబర్‌ క్రైమ్‌ పోలీసులు లేఖ రాశారు.

సైబర్‌ క్రైమ్‌ పోలీసుల లేఖతో 50 లోన్‌ యాప్‌లను ప్లేస్టోర్‌ నుంచి తొలగించారు. లోన్‌ యాప్స్‌ విషయంలో సైబర్‌ క్రైమ్‌ పోలీసుల ప్రజలకు హెచ్చరికలు జారీచేశారు. లోన్‌ యాప్‌లో ఎవరూ కూడా రుణాల కోసం ఎవరూ ఆసక్తి చూపవద్దని సూచించారు. ఒక్కసారి లోన్‌ యాప్‌లో రిజిస్టర్‌ చేస్తే కాంటాక్ట్స్‌ అన్ని కేటుగాళ్ల చేతుల్లోకి పోతాయని హెచ్చరించారు. ఇక లోన్‌ యాప్‌ ప్రధాన నిర్వా#హకురాలు జెన్నీఫర్‌ కోసం పోలీసులు గాలింపు చేపట్టారు..

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement