Monday, November 25, 2024

LK Advani – ఎల్ కె అద్వానీకి అస్వస్థత – ఢిల్లీలోని ఎయిమ్స్‌ లో చికిత్స

మాజీ ఉప ప్రధాని, బీజేపీ సీనియర్ నేత లాల్ కృష్ణ అద్వానీ ఆరోగ్యం క్షీణించడంతో ఢిల్లీలోని ఎయిమ్స్‌ లో చేర్పించారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయనను బుధవారం రాత్రి 10.30 గంటలకు ఎయిమ్స్‌లోని పాత ప్రైవేట్ వార్డులో చేర్చారు..

అద్వానీకి యూరాలజీకి సంబంధించిన సమస్యలు ఉన్నాయి. యూరాలజీ ప్రొఫెసర్ డాక్టర్ అమలేష్ సేథ్ ఆధ్వర్యంలో ఆయన చికిత్స పొందుతున్నారు. అద్వానీ మెడికల్ బులెటిన్‌ను ఎయిమ్స్ వైద్యులు, వైద్య నిపుణులు త్వరలో విడుదల చేయనున్నారు. అద్వానీ వయస్సు 96 సంవత్సరాలు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement