Tuesday, November 26, 2024

విమానంలో బల్లి లొల్లి.. అమెరికా నుంచి బ్రిట‌న్‌కు దాకా..

లండన్: ఔను.. ఓ బల్లి ఏకగా 7 వేల కి.మి. దూరం ప్రయాణించి అమెరికా నుంచి బ్రిటన్ చేరుకుంది. అదీ ఓ విమానంలో. ప్రయాణికురాలి సూట్ కేసులో ఇరుక్కుపోయి వచ్చిన ఆ బల్లి ఓ అరుదైన జాతికి చెందినది కావడంతో ప్రపంచ ప్రఖ్యాత రాయల్ సొసైటీ ఫర్ ది ప్రివెన్షన్ ఆఫ్ క్యూయల్టీ టు యానిమల్స్ సంస్థ దాన్ని రక్షించి తమ సంరక్షణకు తీసుకువెళ్లింది. ఇది ఇప్పుడు వైరల్ అయ్యింది.

అమెరికాలోని ఫ్లోరిడాకు వచ్చిన బ్రిటన్ కు చెందిన రాసెల్ బాండ్ అనే పర్యాటకురాలు రెండు రోజుల క్రితం తిరుగు ప్రయాణమైంది. ఇంటికి చేరిన త‌ర్వాత‌ తన లగేజ్ సర్దుతున్న తన 84 ఏళ్ల తల్లి కెవ్వున కేక పెట్టడంతో హడలిపోయింది. వెళ్లి చూస్తే తన సూట్ కేసు లోంచి బయటకు వచ్చిన ఓ అందమైన ఆకుపచ్చని బల్లి కనిపించింది. అమెరికాలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే మనగలిగే ఈ అనేల్ లిజార్డ్ ఇంత సుదూర ప్రయాణం తరువాత, పూర్తి విరుద్ధమైన వాతావరణంలో బతికుండటం విశేషం. ఈ విషయం తెలుసుకున్న జంతు సంరక్షక అధికారులు వచ్చి ఆ బుల్లి బల్లిని తీసుకువెళ్లారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement