భారతదేశ అత్యున్నత న్యాయస్థానం కీలక కేసుల విచారణలను ఇకపై ప్రత్యక్షంగా చూసే అవకాశం కల్పించనున్నది సుప్రీంకోర్టు. సెప్టెంబర్ 27వ తేదీ నుంచి రాజ్యాంగ ధర్మాసనం నేతృత్వంలోని కేసుల విచారణలు ప్రత్యక్ష ప్రసారం చేయాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది. మంగళవారం భారత ప్రధాన న్యాయమూర్తి యు.యు.లలిత్ ఆధ్వర్యంలో జరిగిన ఫుల్ కోర్టు సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. తొలుత కొన్ని రోజులు లీగల్ న్యూస్ పోర్టల్ కోట్ చేసిన మూలాధారాల ప్రకారం, సుప్రీంకోర్టు విచారణను యూట్యూబ్‌లో ప్రసారం చేస్తుంది.
త్వరలోనే కేసులను ప్రత్యక్ష ప్రసారం చేయడానికి దాని స్వంత ప్లాట్‌ఫారమ్‌ను అభివృద్ధి చేయనున్నట్లుగా బార్ అండ్ బెంచ్ నివేదించింది. ఇటీవల సిజె ఎన్వి రమణ పదవీ విరమణ చేసిన రోజున సుప్రీంకోర్టు తన కార్యకలాపాలను మొట్టమొదటసారిగా ఎన్‌సిఐ వెబ్‌కాస్ట్ పోర్టల్‌లో ప్రత్యక్ష ప్రసారం చేసింది. ఇదిలావుండగా నిన్న జరిగిన ఫుల్ కోర్టు సమావేశంలో కోర్టు విచారణకు కేసులను లిస్టింగ్ చేసే కొత్త విధానాన్ని తీసుకురావాలని కూడా నిర్ణయించారు.
మంగళవారం, బుధ, గురువారాల్లో లంచ్ తర్వాత రెండు గంటల వ్యవధిలో తాజా విషయాలను వినడానికి భిన్నంగా, మంగళవారం మధ్యాహ్నం విన్న తాజా విషయాలను బుధవారం, గురువారం మధ్యాహ్నం విచారణకు తీసుకువెళ్ళాలనే నిర్ణయాలను తీసుకున్నారు. దేశ ప్రజలందరూ వీక్షించేలా సర్వోన్నత న్యాయస్థానం విచారణలను ప్రత్యక్ష ప్రసారం చేయాలని సుప్రీంకోర్టు 2018లోనే నిర్ణయం తీసుకున్నప్పటికీ ఆచరణలోకి రాలేదు. తాజాగా ఈనెల 27వ నుంచి లైవ్ స్ట్రీమింగ్‌ను ఆచరణలో పెట్టనున్నారు.