Friday, October 18, 2024

LIVE – సుప్రీంకోర్టు ఆన్‌లైన్‌! విచార‌ణ‌ల‌న్నీ లైవ్ టెలీకాస్ట్‌

వాద ప్ర‌తివాద‌న‌లు, తీర్పులు చూడొచ్చు
అధికారికంగా ప్ర‌క‌టించిన చీప్ జ‌స్టిస్ డీవై చంద్ర‌చూడ్
ప్ర‌యోగాత్మ‌కంగా ప‌రిశీల‌న చేస్తున్నాం
స‌క్సెస్ కాగానే అందుబాటులోకి తెస్తామ‌న్న చీఫ్ జ‌స్టిస్‌

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్‌, న్యూ ఢిల్లీ :
భారత న్యాయ చరిత్రలో మరో ముందడుగు పడింది. సుప్రీంకోర్టులోని అన్ని బెంచ్‌లలో జరిగే వాదనలు ప్రజలంతా వీక్షించేలా ఏర్పాట్లు చేస్తున్న‌ట్టు చీప్ జ‌స్జీస్ డీవై చంద్ర‌చూడ్ శుక్ర‌వారం ప్ర‌క‌టించారు. దీనికోసం కొత్తగా రూపొందించిన సాఫ్ట్‌వేర్‌తో ఈ ప్రయోగాత్మక పరిశీలన చేయబోతున్నట్లు తెలిపారు. లోటుపాట్లు సవరించి.. త్వరలోనే అధికారికంగా సుప్రీంకోర్టులోని అన్ని బెంచ్‌లలో జరిగే వాదనలు, తీర్పులు ప్రజలు ప్రత్యక్ష ప్రసారంలో చూసేలా అందుబాటులోకి తీసుకురానున్నట్లు పేర్కొన్నారు.

సుప్రీంకోర్టు సొంత పోర్ట‌ల్‌..

- Advertisement -

కాగా, ఇవాళ ఒక టెస్ట్ ఫార్మాట్‌లో ప్రత్యక్ష ప్రసారం చేయగా యూట్యూబ్ చానెల్‌కు బదులుగా కోర్టుకు చెందిన సొంత అప్లికేషన్‌పై లైవ్ ప్రసారం చేశారు. ఇది స‌క్సెస్ కావ‌డంతో త్వ‌ర‌లో లైవ్ ప్ర‌సారాల‌కు రంగం సిద్ధం చేస్తున్న‌ట్టు చీఫ్ జ‌స్టిస్ తెలిపారు. ఇదిలా ఉంటే 2022 నుంచి రాజ్యాంగ ధర్మాసనం ప్రజా ప్రాముఖ్యత కలిగిన కేసు వాదనలు, తీర్పులను మాత్రమే ప్రజలు వీక్షించేలా ప్రత్యక్ష ప్రసారం చేస్తోంది. అప్పట్లో సర్వోన్నత న్యాయస్థానం విచారణల ప్రత్యక్ష ప్రసారాన్ని ప్రారంభించిన తొలి రోజు 8 లక్షల మంది చూశారు.

ప‌లు కేసుల‌పై ప్ర‌జ‌ల ఆస‌క్తి..

ఇటీవల నీట్-యూజీ విషయంలో ముగ్గురు న్యాయమూర్తుల బెంచ్ విచారణలు, ఆర్జీ కర్ హస్పటల్ లో జూనియర్ డాక్టర్ హత్యకు సంబంధించి సుమోటోగా స్వీకరించిన కేసును కూడా ప్రజా ప్రయోజనాల పరిగణనలోకి తీసుకుని ప్రత్యక్ష ప్రసారం చేసింది. దీనికి కూడా మంచి వ్యూస్ ల‌భించాయి..

Advertisement

తాజా వార్తలు

Advertisement