మెగా పవర్ స్టార్ రాంచరణ్, ఉపాసన దంపతులు తల్లితండ్రులు కాబోతున్నారు.రేపే ఉపాసనకు అపోలో హాస్పిటల్స్ లో డెలివరీ కాబోతుందని. సమాచారం. ఉపాసన కోసం హైదరాబాద్ లోని అపోలో హాస్పిటల్ లో ఒక ఫ్లోర్ మొత్తాన్ని బ్లాక్ చేసారు. కేవలం కుటుంబ సబ్యులకు మినహా, వ్యక్తిగత సిబ్బందికి కూడా లోపలకు అనుమతి లేదు. బిడ్డకి ఇన్ఫెక్షన్ సోకకుండా ఉండేందుకే ఇలా చేస్తున్నారట.
రామ్ చరణ్ గత రెండు రోజుల నుండి ఉపాసన అవసరాలను చూసుకునేందుకు అపోలో హాస్పిటల్ లోనే ఉన్నాడట. గత కొంత కాలం గా ఆయన షూటింగ్స్ కి దూరం గా ఉంటూ, కేవలం ఉపాసన కోసమే ఇంట్లో ఉంటూ ఆమె బాగోగులు చూసుకుంటే వచ్చేవాడు. ఇన్ని రోజులు వీళ్లిద్దరు ప్రత్యేకమైన అపార్ట్మెంట్స్ లో నివసిస్తూ వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే.
ఇక నుండి రామ్ చరణ్ ఉపాసన దంపతులు చిరంజీవి ఇంట్లోనే ఉండబోతున్నారట. అందుకోసం చిరంజీవి తన ఇంటిలోని పై ఫ్లోర్ లో గత కొంత కాలం గా మరమ్మత్తులు చేయిస్తూ వచ్చాడు. ఇప్పుడు అవన్నీ పూర్తి అయ్యాయట