శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం మరింత తీవ్రం అవుతున్నది. ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కేందుకు నిత్యావసర సరుకులతో పాటు ఇంధన ధరలు భారీగా పెంచేసింది. దీంతో అక్కడి నిరుపేదలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చేతిలో డబ్బుల్లేక వస్తువులు కొనుగోలు చేయని పరిస్థితి ఏర్పడింది. సామాన్య, మధ్య తరగతి ప్రజలందరూ.. రోడ్లపైకి వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలియజేస్తున్నారు. మరోసారి తాజాగా చమురు ధరలను పెంచుతూ అక్కడి ప్రభుతం నిర్ణయం తీసుకుంది. తాజాగా పెంపుతో లీటర్ పెట్రోల్ ధర రూ.338కు చేరుకుంది. లీటర్ పవర్ పెట్రోల్ ధర రూ.373 పలుకుతున్నది. ప్రభుత్వం తీరుపై అక్కడి ప్రజలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు.
అంతర్జాతీయంగా అధిక ధరలు, డాలర్‌తో శ్రీలంక రూపాయి క్షీణత ప్రధాన కారణమని అధికారులు చెబుతున్నారు. 1948లో బ్రిటన్ నుంచి సాతంత్య్రం పొందినప్పటి నుంచి శ్రీలంక ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటూనే ఉంది. ఈ సంక్షోభం కొంత వరకు విదేశీ కరెన్సీ కొరత కారణంగా ఏర్పడింది. దేశం ప్రధాన ఆహారాలు, ఇంధనం దిగుమతుల కోసం డబ్బులు చెల్లించలేని పరిస్థితి ఎదుర్కొంటున్నది. అధ్యక్షుడు రాజక్సేకు వ్యతిరేకంగా భారీ ప్రజా ఆందోళన మంగళవారంతో 11వ రోజుకు చేరుకుంది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..