Saturday, November 23, 2024

Liquor Shop : మ‌ద్యం ప్రియుల‌కు గుడ్ న్యూస్‌… డిసెంబ‌ర్ 31 నైట్ అమ్మ‌కాలు ఎప్పటి వరకంటే..!!

తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇది మ‌ద్యం ప్రియుల‌కు గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఈసారి న్యూ ఇయ‌ర్ వేడుక‌లు ఘ‌నంగా జ‌రుపుకునేందుకు చిన్న‌పెద్ద తేడా లేకుండా అంద‌రూ సిద్ధ‌మ‌వుతున్నారు. ఇప్ప‌టి నుంచే ప్లాన్ కూడా రెడీ చేసుకుంటున్నారు. న్యూ ఇయ‌ర్ అంటే.. తాగుడు.. తినుడు అనే కాడికి వ‌చ్చింది. ఇదిలా ఉంటే డిసెంబర్ 31 రాత్రి మద్యం అమ్మకాలపై ప్ర‌భుత్వం సడలింపులు ప్రకటించింది. రాత్రి ఒంటి గంట వరకు మద్యం అమ్ముకోవచ్చని ఆదేశాలు జారీ చేసింది. బార్లు, పబ్బులు, వైన్ షాపులు తెరిచి ఉంచే సమయాన్ని పొడిగించింది. ఈమేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. రిటైల్ మ‌ద్యం షాపులు ప్ర‌స్తుతం 11 గంట‌ల వ‌ర‌కు తెరుచుకుని ఉంటున్నాయి.. దీన్ని స‌డ‌లిస్తూ 31 నైట్ 12 గంట‌ల వ‌ర‌కు ఓపెన్ చేసుకోవ‌చ్చిన ప్ర‌భుత్వం అనుమ‌తులు జారీ చేసింది. అదేవిధంగా బార్ అండ్ రెస్టారెంట్లు రాత్రి 1 గంట‌ల వ‌ర‌కు న‌డుపుకోవ‌చ్చిన నిర్ణ‌యించింది. క‌రోనా క‌ష్ట‌కాలంలో న‌ష్ట‌పోయిన మ‌ద్యం వ్యాపారుల‌కు ఇది క‌లిసొచ్చేలా ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement