Tuesday, November 26, 2024

Liquor Scam – కేజ్రీవాల్ బెయిల్ పై తీర్పు రిజర్వ్

ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ముఖ్యమంత్రి కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్‌పై జస్టిస్ నీనా బన్సల్ కృష్ణ సోమవారం విచారణ జరిపారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్‌పై మొదట విచారణ ట్రయల్ కోర్టులో జరగాలని సీబీఐ తెలిపింది. కేజ్రీవాల్ సహా ఆరుగురిపై చార్జ్‌షీట్ దాఖలు చేసినట్లు హైకోర్టుకు సీబీఐ తెలిపింది. కేసు దర్యాప్తును కేజ్రీవాల్ ప్రభావితం చేస్తున్నారని.. కేజ్రీవాల్ అరెస్ట్ తర్వాత అనేక ఆధారాలు వెలుగులోకి వచ్చాయని సమగ్ర దర్యాప్తు జరిపి చార్జ్‌షీట్ దాఖలు చేసిసట్లు న్యాయస్థానానికి సీబీఐ తెలిపింది.

ఇదిలా ఉంటే లిక్కర్ పాలసీకి సంబంధించి సీబీఐ కేసులో కేజ్రీవాల్‌కి వ్యతిరేకంగా ఎటువంటి ఆధారాలు లేవని.. రికవరీ కూడా లేదని కేజ్రీవాల్ తరపు న్యాయవాది అభిషేక్ సింఘ్వి తెలిపారు. లిక్కర్ పాలసీ ఆమోదంపై కేజ్రీవాల్‌తో పాటు ఢిల్లీ ఎల్జీ సహా 15 మంది సంతకం చేశారరని వారిని ఎందుకు నిందితులుగా సీబీఐ చేర్చలేదని సింఘ్వి ప్రశ్నించారు. సీబీఐ కేసులో కేజ్రీవాల్ సూత్రధారి అంటున్నారని.. కానీ ఆయనకు వ్యతిరేకంగా ఆధారాలు లేవన్నారు. విజయ్ నాయర్‌కి సీబీఐ కేసులో బెయిల్ వచ్చిందని, కేజ్రీవాల్‌కు కూడా బెయిల్ ఇవ్వాలని అభిషేక్ సింఘ్వి కోర్టును కోరారు. ఇరువాదనలు విన్న కోర్టు తీర్పును రిజర్వ్ చేసినట్లు ప్రకటించింది..

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement