ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో అరెస్టైన ఎమ్మెల్సీ కవితను నేడు కోర్టులో హాజరు చింది సీబీఐ. నిన్న కవితను అరెస్ట్ చేసిన అధికారులు ఆమెను సీబీఐ హెడ్‌క్వార్టర్స్‌కు తరలించారు. ఈ ఉదయం కోర్టు ముందు ప్రవేశపెట్టిన సిఐడి అయిదు రోజులు కవితను తమ కస్టడీకీ ఇవ్వాలని కోరింది.
ముందుగా సిబిఐ న్యాయవాది తన వాదన వినిపిస్తూ,…
కవిత ఈ మొత్తం ఎపిసోడ్ లో కవిత కీలక పాత్రధారి, సూత్రధారి
విజయ్ నాయర్, తదితరులతో కలిసి స్కెచ్ వేశారు
ఢిల్లీ, హైదరాబాద్ లలో సమావేశాలు జరిగాయి
కవిత ఆడిటర్ బుచ్చిబాబు వాంగ్మూలం ప్రకారం కవిత పాత్ర స్పష్టమవుతుంది
రూ. 100 కోట్లు సౌత్ గ్రూప్ నుంచి సమీకరించి ఆప్ నేతలకు అందించారు
కవిత సూచన మేరకు మాగుంట శ్రీనివాసులురెడ్డి రూ. 25 కోట్లు అందజేసారు
ఈ విషయాన్ని ఆయన తన వాంగ్మూలంలో వెల్లడించారు
వాట్సాప్ చాట్ సంభాషణలు కూడా ఈ విషయాలను ధృవీకరిస్తున్నాయి
కోర్టుకు వాటిని అందజేసాం
కవిత పీఏ అశోక్ కౌశిక్ వాంగ్మూలం ప్రకారం అభిషేక్ బోయినపల్లి సూచన మేరకు భారీ మొత్తంలో డబ్బు ఆప్ నేతలకు అందించినట్టు తెలిపారు
ఆడిటర్ బుచ్చిబాబు స్టేట్మెంట్ ప్రకారం కవితకు ఇండో స్పిరిట్స్ సంస్థలో 33% వాటా ఉంది
ఇవన్నీ మేము ఇప్పటికే దాఖలు చేసిన చార్జిషీట్లలో పొందుపరిచాం. ఆధారాలు కూడా జతపరిచాం
శరత్ చంద్ర రెడ్డికి కేటాయించిన 5 జోన్లకు ప్రతిఫలంగా జోన్ కి రూ 5 కోట్లు చొప్పున రూ. 25 కోట్లు ఇవ్వాలని కవిత డిమాండ్ చేశారు
అందుకు శరత్ చంద్ర రెడ్డి విముఖత వ్యక్తం చేశారు. దీంతో శరత్ చంద్ర రెడ్డిని కవిత బెదిరించారు
హైదరాబాద్ తన వ్యాపారం సాగనివ్వను అని బెదరించారు
దీని తర్వాత కవిత తరఫున న్యాయవాది వాదనలు వినిపించారు..
ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పును మధ్యాహ్నం రెండు గంటలకు వాయిదా వేశారు..
కాగా,. సౌత్ గ్రూపుకు ఆప్‌కు మధ్య కవిత దళారీగా వ్యవహరిస్తూ 100 కోట్ల ముడుపులు చెల్లించడంలో కీలకపాత్ర పోషించారని సీబీఐ అభియోగం మోపింది. ఈనెల 6న తీహార్ జైల్లోనే కవితను ప్రశ్నించింది సీబీఐ. తనను సీబీఐ ప్రశ్నించడాన్ని కవిత కోర్టులో సవాల్ చేశారు. ఆ కేసు విచారణ జరగకముందే ఆమెను సీబీఐ అరెస్ట్ చేసింది.
ఇటు సీబీఐ అరెస్టు చేయడాన్ని సవాల్ చేస్తూ కవిత రౌస్ అవెన్యూ కోర్టును ఆశ్రయించారు. అత్యవసరంగా సీబీఐ స్పెషల్ కోర్టు ముందు అప్లికేషన్ ఫైల్ చేశారు. నోటీసు ఇవ్వకుండా సీబీఐ అరెస్ట్ చేసిందని కవిత తరఫు లాయర్లు వాదనలు వినిపించారు. జడ్జ్ ఆదేశాలతో ఈ ఉదయం రెగ్యులర్ కోర్టు ముందు అప్లికేషన్ ఫైల్ చేయనున్నారు ఆమె లాయర్లు. పరిస్థితి చూస్తుంటే కవిత ఇప్పట్లో జైలు నుంచి బయటకు రావడం అనుమానంగానే కనిపిస్తోంది. లిక్కర్ కేసులో ఆమె పూర్తిగా ఈడీ, సీబీఐ చట్రంలో చిక్కుకుపోయారు. కవితను మార్చి 15న ఈడీ అరెస్టు చేసింది, విచారణ తర్వాత ఆమెను తీహార్ జైలుకు తరలించారు.
ఇప్పుడు ఆమెను సీబీఐ పీటీ వారంట్ పై అరెస్టు చేశారు. ఒకవేళ సీబీఐ కస్టడీకి ఇస్తే.. అధికారులు ఆమెను సీబీఐ కార్యాలయానికి తరలించి ప్రశ్నిస్తారు. కవితకు ఈడీ కోర్టు బెయిల్ ఇచ్చినా.. సీబీఐ కేసుతో ఆమె జైలులోనే ఉండాల్సి ఉంటుంది. సీబీఐ కోర్టు కూడా బెయిల్ ఇస్తేనే ఆమె బయటికొస్తారు. ఈడీ, సీబీఐ కేసుల్లో బెయిల్ రావడం అంత ఈజీ కాదు. గతంలో చాలా కేసుల్లో నెల తరబడి నిందితులు జైలులోనే ఉన్నారు.ఇదే లిక్కర్ కేసులో ఆప్ నేత మనీష్ సిసోడియా ఎన్నో నెలలుగా తీహార్ జైలులోనే ఉన్నారు. మొత్తంగా చూస్తే.. నెలల తరబడి జైలులో ఉండాల్సిన పరిస్థితులే కనిపిస్తున్నాయి.