Saturday, December 21, 2024

Liquor Scam – కేజ్రీవాల్ పై ఈడి విచార‌ణ‌కు గ‌వ‌ర్న‌ర్ అనుమ‌తి

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు భారీ షాక్ తిగింది. ఎక్సైజ్ పాలసీ కేసులో కేజ్రీవాల్‌ను విచారించేందుకు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌కు అనుమతి ఇచ్చారు. ఎక్సైజ్ పాలసీని రూపొందించడంతో పాటు అమలు చేయడంలో భారీ అవినీతి జరిగిందని ఈడీ ఆరోపించింది.

ఈ కేసులో డిసెంబర్ 5న మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను విచారించేందుకు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌ను ఈడీ అనుమతి కోరింది. తాజాగా, లెఫ్టినెంట్‌ గవర్నర్‌ కేజ్రీవాల్‌ను విచారించేందుకు పర్మిషన్ ఇచ్చారు. దీంతో మద్యం పాలసీ కేసులో కేజ్రీవాల్‌ను మరోసారి ఈడీ విచారణ చేయనుంది. మద్యం పాలసీకి సంబంధించిన మనీ లాండరింగ్‌ కేసులో కేజ్రీవాల్ ను ఈ ఏడాది మార్చి 21వ తేదీన ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అరెస్ట్‌ చేసింది. ఈ కేసులో కేజ్రీవాల్‌కు జూలై 12న సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్‌ ఇచ్చింది. సెప్టెంబర్‌ 13న కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు షరతులతో కూడిన బెయిల్‌ను ఇవ్వడంతో ఆయన ఆరు నెలలు శిక్ష అనుభవించిన తర్వాత తీహార్‌ జైలు నుంచి రిలీజ్ అయ్యారు. ఈ కేసులోనే ఈడీ మ‌రోసారి కేజ్రీవాల్ ను విచారించేందుకు సిద్ద‌మ‌వుతున్న‌ది..

Advertisement

తాజా వార్తలు

Advertisement